Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో నేటి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇవాళ శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు అర్చకులు. రేపు స్వర్ణరథంపై మాడవీధులలో శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి ఊరేగనున్నారు. మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
Read Also: Memantha Siddham: 20వ రోజుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. నేటి షెడ్యూల్ ఇదే..
నేడు తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం) శ్రీవారిని 73,051 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,599 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు లభించింది.