టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ రీసెంట్ గా నటించిన చిత్రం ఆపరేషన్ వాలంటైన్.. డైరెక్టర్ శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కింది.. ఈ సినిమాకు మొదటి నుంచి మంచి బజ్ ఉంది. అలాగే సినిమా మార్చి 1 న విడుదలై మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఈ సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా, రుహానీ శర్మ, నవదీప్, శతాఫ్, సంపత్, పరేష్ పహుజా, అభినవ్ గోమఠం, అలీ రాజా, శ్వేతవర్మ తదితరులు నటించారు. రెనైసెన్స్ పిక్చర్స్, సోని పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది..
పుల్వామా దాడి, భారతదేశం ఉగ్రవాదులకు ఇచ్చిన కౌంటర్ అటాక్ లాంటి యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగులో ఎప్పుడు ఇలాంటి సినిమా రాలేదు.. మొదటిసారి వచ్చిన సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఈ సినిమాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి అద్భుతంగా చూపించారు.. సినీ ప్రేక్షకులను ఈ అంశం బాగా ఆకట్టుకుంది..
ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ దక్కించుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలో సందడి చేయనుంది.. మొదట ఏప్రిల్ మొదటి వారంలో అనుకున్నా కూడా ఇప్పుడు ముందుగానే ఓటీటీలోకి రాబోతుందని సమాచారం.. మార్చి 29 న స్ట్రీమింగ్ కాబోతుందని తెలుస్తుంది.. దీనిపై మేకర్స్ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది.. అదే కన్ఫర్మ్ అయితే సినీ ప్రియులు ఆ తేదీన చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు..