Site icon NTV Telugu

Varun Tej Wishes Lavanya Tripathi: హ్యాపీ బర్త్‌డే బేబీ! అంటూ భార్యకు విషెస్ చెప్పిన వరుణ్ తేజ్

Varun Tej Wishes Lavanya Tripathi

Varun Tej Wishes Lavanya Tripathi

Varun Tej Wishes Lavanya Tripathi: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠికి 34వ బర్త్‌డే సందర్బంగా.. సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపాడు. ఇక ఇంస్టాగ్రామ్ లో వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠిని ప్రస్తావిస్తూ.. “పుట్టినరోజు శుభాకాంక్షలు బేబీ! నువ్వు నా జీవితంలోకి వచ్చి చాలా ఆనందం, శాంతిని తెచ్చావని.. ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి జ్ఞాపకం నీతో మరింత అందంగా ఉంటుందని తెలిపారు. నిన్ను ఎంతో ప్రేమిస్తున్నానని, నన్ను డ్యాన్స్ చేసేలా చేసేది నువ్వే ఒక్కదానివే అంటూ తన ప్రేమను వరుణ్ తేజ్ భార్యను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో భావోద్వేగపు సందేశం పోస్ట్ చేశారు.

Also Read: Robotic Elephant: మఠానికి రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చిన బాలీవుడ్ స్టార్ కపుల్

ఈ జంట 7 ఏళ్ల ప్రేమ తర్వాత గత ఏడాది నవంబర్ 1న పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. సినిమాలు చేస్తున్న సమయంలో నటి లావణ్య త్రిపాఠి, నటుడు వరుణ్ తేజ్ ప్రేమలో పడ్డారు. ఇక నేడు ఇక లావణ్య త్రిపాఠి సందర్బంగా ఆమె ఫాన్స్, ఆమె సినీ ఫ్రెండ్స్ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠితో ఉన్న ఫోటోలను పంచుకోవడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read: Wife Murdered Husband: పెళ్లయిన నాలుగు రోజులకే భర్తను హత్య చేసిన భార్య.. అసలెందుకు ఇలా

Exit mobile version