NTV Telugu Site icon

Varun Tej VT15: హారర్ కామెడీతో మెప్పించడానికి సిద్ధమైన వరుణ్ తేజ్.. పుట్టినరోజు నాడు కొత్త సినిమా అనౌన్స్..

Vt15

Vt15

Varun Tej VT15: టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒక్కరైనా వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా.. కొత్త కథలను ఎంచుకుంటూ తన నటనతో ఎంతోమంది సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చొరగొన్నాడు. ఇకపోతే నేడు వరుణ్ తేజ్ 34 ఏడాదిలోకి అడుగు పెట్టాడు. ఇక వరుణ్ తేజ్ సినిమాల్లో కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. కానీ, ఆయనకు గతంలో కొన్ని సినిమాలలో నిరాశే ఎదురైంది. వరుణ్ తేజ్ నటించిన చివరి మూడు సినిమాలు గాండీవధర అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా పెద్దగా విజయం సాధించలేకపోయాయి. ఈ నేపథ్యంలో, వరుణ్ పుట్టిన రోజు సందర్భంగా తన 15వ సినిమాను ప్రకటించారు.

తాజాగా వరుణ్ తేజ్ హీరోగా కొత్త సినిమా కోసం పోస్టర్‌ను విడుదల చేశారు. యువీ క్రియేషన్స్ బ్యానర్ పై, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. పోస్టర్ లో ఒక చిన్న కుండ కనిపిస్తోంది, కుండపై డ్రాగన్ బొమ్మ ఉండగా, చుట్టూ కొరియన్ భాషలో అక్షరాలు వ్రాయబడ్డాయి. ఈ పోస్టర్ ద్వారా, ఈ సినిమా ఇండో-కొరియన్ హారర్ కామెడీ కథగా రూపొందుతోందని అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం కూడా ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉండబోతుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ గతంలో కృష్ణార్జున యుద్ధం, మ్యాస్ట్రో, లైక్ షేర్ సబ్ స్క్రైబ్ వంటి సినిమాలను తెరకెక్కించినప్పటికీ అవి పెద్ద విజయాలను అందుకోలేకపోయాయి.

Also Read: TikTok Ban: అమెరికాలో టిక్‌టాక్‌ సేవలు బంద్‌..

హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ సినిమాతో వరుణ్ తేజ్ మరోమారు కొత్త ప్రయోగాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇండియా – కొరియా కథతో, వినూత్నమైన హారర్ కామెడీ చిత్రంగా ఇది ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి. ముఖ్యంగా, వరుణ్ తేజ్ మళ్లీ తన ఫామ్ లోకి వస్తాడని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఈ సినిమాతో ఆయన తిరిగి హిట్ కొడతాడా లేదో వేచి చూడాల్సిందే.