Varun Tej- Lavanya: టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్న వరుణ్.. పెద్దలను ఒప్పించి జూన్ 9న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్ మణికొండలోని నాగబాబు నివాసంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. మెగాస్టార్ దంపతులు, రామ్ చరణ్ దంపతులు పాల్గొన్నారు. ఈ నిశ్చితార్థం జరిగిన తర్వాత దిగిన ఓ ఫొటోను వరుణ్ తాజాగా అభిమానులతో పంచుకున్నాడు.
Also Read: Venkatarami Reddy: డీసీ మాజీ ఛైర్మన్ వెంకట్రామి రెడ్డి మరోసారి అరెస్ట్.. కారణం ఇదీ..
ప్రస్తుతం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి విహార యాత్రలో ఉన్నారు. విదేశాల్లో దిగిన ఓ ఫొటోను ఇద్దరు తమ అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తమ ఎంగేజ్‌మెంట్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఇక్కడ వరుణ్, లావణ్యలు ఒకే ఫొటోను, ఒకే క్యాప్షన్‌తో షేర్ చేయడం విశేషం. ఫొటోలో వరుణ్ తేజ్ చేయి పట్టుకుని లావణ్య నడుస్తూ చిరునవ్వు చిందించారు. ఈ ఫొటో పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే లైక్స్, కామెంట్స్ వర్షం కురిసింది. ప్రస్తుతం వరుణ్-లావణ్యల ఫొటో సోషల్ మీడియాలో వైలర్‌గా మారింది.
Also Read: Yogini Ekadashi: యోగిని ఏకాదశి నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సమస్త కోరికలు నెరవేరుతాయి
2017లో విడుదలైన ‘మిస్టర్’ సినిమాలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు తొలిసారి కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ తర్వాత ఏడాది ఇద్దరు కలిసి ‘అంతరిక్షం’ సినిమాలో నటించారు. దాంతో వీరిద్దరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇక వరుణ్ చెల్లెలు నిహారిక పెళ్లిలో లావణ్య సందడి చేశారు. అప్పటినుంచి వరుణ్-లావణ్యల మధ్య ఏదో ఉందని నెట్టింట వార్తలు వస్తూనే ఉన్నాయి. చివరకు ఆ వార్తలే నిజమైయ్యాయి. ఇక శ్రావణ మాసంలో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read: Goods Train Derailed: పట్టాలు తప్పిన రైలు.. విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం
వరుణ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న ‘గాండీవధారి అర్జున’ సినిమా చేస్తున్నాడు. ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా పూర్తైన తర్వాత శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఓ సినిమా, కరుణ్ కుమార్ దర్శకత్వంలో మరో సినిమా వరుణ్ చేయనున్నారు. మరోవైపు లావణ్య త్రిపాఠి ప్రస్తుతం కోలీవుడ్‌లో అధర్వ హీరోగా వస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్న ఓ సినిమాలో, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రానున్న ఓ వెబ్ సిరీస్‌లో లావణ్య నటించనున్నారు.
Thanks to and each & everyone for the warm wishes! ♾️♥️@Itslavanya pic.twitter.com/x0rpL27Ovw
— Varun Tej Konidela (@IAmVarunTej) June 13, 2023