Site icon NTV Telugu

Varudu Kalyani: తాట తీస్తా అన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ?.. వరుదు కళ్యాణి సెటైర్లు!

Varudu Kalyani

Varudu Kalyani

మహిళల మీద చెయ్యి వేస్తే తాట తీస్తా అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి సెటైర్లు వేశారు. 50 మంది మహిళను నెల రోజుల నుంచి వేధిస్తే.. పవన్ కళ్యాణ్ గారు ఏం చర్యలు తీసుకున్నారు అని ప్రశ్నించారు. టీడీపీ నేతల మద్దతుతో మహిళలు, చిన్నారులపై హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. హోం మంత్రి వంగలపూడి అనిత నివాసానికి కూత వేటు దూరంలో డ్రగ్స్ దొరకడం దారుణ ఘటన అని వరుదు కళ్యాణి పేర్కొన్నారు. కాకినాడ జీజీహెచ్‌ రంగరాయ మెడికల్ కాలేజీలో చోటుచేసుకున్న ఘటనపై ఆమె ధ్వజమెత్తారు.

Also Read: Pulasa Fish: యానాంలో చిక్కిన పులస.. వేలంలో తీవ్ర పోటీ, కేజీకి ఊహించని ధర!

‘కాకినాడ జీజీహెచ్‌లో కీచక పర్వం జరిగింది. ల్యాబ్ అసిస్టెంట్ చేతిలో నెల రోజులకు పైగా వేదింపులకు గురయ్యారు. నేను చెప్పినట్లు చేయకపోతే ఫెయిల్ చేస్తానని ల్యాబ్ అసిస్టెంట్ బెదిరించాడు. మహిళల మీద చెయ్యి వేస్తే తాట తీస్తా అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ?. 50 మంది మహిళలను నెల రోజుల నుంచి వేధిస్తే.. ఏమి చర్యలు తీసుకున్నారు. టీడీపీ నేతల మద్దతుతో మహిళలు, చిన్నారులపై హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ దుర్మార్గాలు హోమ్ మంత్రి అనిత కంటికి కనిపించవా?. పోలీస్ వ్యవస్థను కక్ష్య సాధింపు చర్యలకు ప్రభుత్వం వాడుతుంది. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిపోయింది. హోం మంత్రి నివాసానికి కూత వేటు దూరంలో డ్రగ్స్ దొరికాయి’ అని వరుదు కళ్యాణి మండిపడ్డారు.

Exit mobile version