Site icon NTV Telugu

Varanasi : ‘వారణాసి’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Varanasi Mahesh Babu

Varanasi Mahesh Babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘వారణాసి’ (Varanasi). భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లేలా జక్కన్నా ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. కేఎల్ నారాయణ మరియు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్న ఈ మూవీలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పూర్తిస్థాయి IMAX ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్న ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఒక భారీ అప్‌డేట్ బయటకు వచ్చింది.

Also Read : Allu Arjun : టీ తాగడానికి వెళ్లి చిక్కుల్లో పడ్డ బన్నీ.. భార్య స్నేహ రెడ్డి వీడియో వైరల్

ఈ విజువల్ వండర్‌ను ఏప్రిల్ 9, 2027న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం ద్వారా, లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకోవచ్చు అని రాజమౌళి మాస్టర్ ప్లాన్ వేశారట. ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కి, ఈ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ తోడై సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టును పారిస్‌లో టీజర్ ప్రదర్శనతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘వారణాసి’, ఇప్పుడు ఏప్రిల్ 2027 లో థియేటర్ల వద్ద వసూళ్ల సునామీ సృష్టించడానికి సిద్ధమవుతోంది.

Exit mobile version