వారణాసి నగరమంతటా తాజాగా ప్రత్యక్షమైన హోర్డింగ్స్ ఇప్పుడు సినిమాప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వారణాసి నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఎటు చూసినభారీ హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి. అయితే ఆ హోర్డింగ్స్ లో ఎటుంవంటి సమాచారం లేకుండా కేవలం ‘2027 ఏప్రిల్ 7న థియేటర్ల’లో అని మెన్షన్ చేసారు. ఈ హోర్డింగ్స్‌లో సినిమా పేరు లేదా నటీనటుల వివరాలు ఏమి లేకపోవడంతో అసలు ఇవి ఎవరు ఏర్పాటు చేశారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఉద్దేశపూర్వకంగా ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా, కేవలం తేదీతో ఆడియన్స్ లో మరింత క్యూరియాసిటీ పెంచేలా ప్లాన్ చేశారు.
Also Read : KING Nagarjuna : 100 వ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న కింగ్
ఇప్పటికే ఈ హోర్డింగ్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసలు ఇది ఏ సినిమా? ఎవరి ప్రాజెక్ట్? ఎందుకు ఇంత ముందుగానే తేదీని ప్రకటించారు? అనే ప్రశ్నలు నెటిజన్లను వెంటాడుతున్నాయి. “కీప్ గెస్సింగ్” అనే తరహాలో ఈ ప్రమోషన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. అయితే ఈ హెర్డింగ్స్ దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరక్కుతున్న ‘వారణాసి’ సినిమాకు సంబంధించినవేనని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఎత్తున జరుగుతోంది. మరోవైపు వారణాసి లో హోర్డింగ్ లు వెలిశాయి. రాజమౌళి షూటింగ్ చక చక చేస్తూనే ప్రమోషన్స్ లో కూడా జోరు చూపిస్తున్నాడని భావిస్తున్నారు. మొత్తానికి, 2027 ఏప్రిల్ 7న ‘వారణాసి’ పేరుతో ఏదో పెద్ద సినిమా రాబోతోందన్న సంకేతాలు ఇస్తూ బజ్ పెంచుతోంది టీమ్.