Site icon NTV Telugu

Varanasi : మహేష్ – రాజమౌళి ‘వారణాసి’ లో హనుమంతుడిగా మాధవన్?

Varanasi Glips

Varanasi Glips

మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోతున్న వారణాసి సినిమా అనౌన్స్ అయినప్పటినుంచి సినిమా మీద అంచనాలు ఉన్నాయి. సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఈ సినిమా టైటిల్ వివాదం కొనసాగుతూ ఉండగానే, ఈ సినిమా నుంచి ఎన్నో అప్‌డేట్స్ బయటకు వస్తున్నాయి. నిజానికి, 2027లో రిలీజ్ చేసే అవకాశం ఉందని ఇప్పటికే రాజమౌళి హింట్ ఇచ్చారు.

Also Read : SS Rajamouli : దేవుడిపై రాజమౌళి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు

ఇక ఈ సినిమాలో హనుమంతుడి పాత్ర కోసం ఒక తమిళ స్టార్ హీరోని తీసుకుంటున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు ఆ స్టార్ హీరో ఎవరనే విషయం మీద కూడా కొంత చర్చ నడుస్తోంది. తమిళంలో ఒకప్పుడు అమ్మాయిల హృదయాలను దోచుకుని క్రేజీ హీరో అనిపించుకున్న మాధవన్, ఈ సినిమాలో ఆంజనేయ స్వామి పాత్రలో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. దానికి సంబంధించి టీమ్ ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, దాదాపుగా ఆయన ఖరారు అయ్యారని అంటున్నారు. సినిమా టీమ్ ఆయన పేరు ఇప్పటివరకు ప్రస్తావించలేదు. కావాలనే ఆయన పేరు దాచారని, రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా త్వరలోనే దాన్ని అనౌన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక ‘వారణాసి’ అనేది డివోషనల్ టచ్‌తో ఉన్న ఒక యాక్షన్ డ్రామా.

Also Read :iBomma One: ఐ-బొమ్మ పోయే ఐ బొమ్మ వన్ వచ్చే

మహేష్ బాబు రాముడి అంశతో ఉన్న రుద్ర అనే పాత్రలో నటించబోతున్నాడు. వాస్తవానికి మాధవన్ సినిమాలో భాగమైనట్లు గతంలో ప్రచారం జరిగింది, కానీ సినిమా టీమ్ దాన్ని ఖండించలేదు, అలా అని ధ్రువీకరించలేదు. ఆయన హనుమంతుని పాత్రలో నటిస్తున్న కారణంగానే సినిమా టీమ్ దానిమీద వ్యూహాత్మక మౌనం పాటించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మిగతా పాత్రలకు సంబంధించి మాత్రం ఎలాంటి హింట్స్ ఇవ్వలేదు. మాధవన్ హనుమంతుడి పాత్ర అంటే కచ్చితంగా దానికి అంత పెద్ద క్రేజ్ అయితే రాదు, కానీ రాజమౌళి క్యాస్టింగ్ విషయంలో చాలా కేర్ఫుల్‌గా ఉంటారు, కాబట్టి ఆయన్నే హనుమంతుడిగా ఎందుకు తీసుకున్నారనేది తెరమీద చూస్తే కానీ చెప్పలేము.

Exit mobile version