Varalaxmi Sarathkumar: ‘ఆయన వల్లే నేను ఇక్కడ ఉన్నాను’.. కన్నీళ్లు పెట్టుకున్న వరలక్ష్మి శరత్ కుమార్

Varalaxmi Sarathkumar

Varalaxmi Sarathkumar

Varalaxmi Sarathkumar: తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్. ఇప్పుడు ఆమె దర్శకురాలిగా తన మొదటి చిత్రం ‘సరస్వతి’తో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..” డైరెక్టర్ గోపీచంద్ మలినేని సార్ నా గురువు, మెంటార్, గైడ్.. ఆయన కారణంగానే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. ఆయనే నాకు సెకండ్ లైఫ్ ఇచ్చారు” అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఇండస్ట్రీ లో అమ్మాయిలు సర్వైవ్ అవడం చాలా కష్టం, వారికి సపోర్ట్ ఇవ్వండి అని కోరారు.

READ ALSO: Maoist Party: మావోయిస్టు పార్టీకి మరో షాక్..! కేంద్ర కమిటీ కార్యదర్శి మల్ల రాజిరెడ్డి సహా 25 మంది లొంగుబాటు?

×
×
Ad

ఇకపోతే ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరస్వతి’ ట్రైలర్ విషయానికి వస్తే.. కనబడకుండా పోయిన కూతురి కోసం ఒక అమ్మ ఎంత దూరం వెళ్తుందో.. అనే స్టోరీ లైన్‌తో ఈ ట్రైలర్ సాగుతుంది. పోలీస్ స్టేషన్‌లో ఆందోళనతో కూర్చున్న వరలక్ష్మి.. కోర్టు డ్రామా.. రివెంజ్ ఎలిమెంట్స్.. అన్నీ కలిసి ఈ చిత్రాన్ని ఒక భిన్నమైన థ్రిల్లర్‌గా మార్చాయి. ప్రియమణి, ప్రకాష్ రాజ్, కిషోర్ వంటి బలమైన నటీనటులతో ఈ సినిమా తెరకెక్కింది. తమన్ సంగీతం ఇప్పటికే సినిమాపై హైప్‌ను పెంచేసింది. ‘దోసా డైరీస్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని వరలక్ష్మి శరత్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. త్వరలోనే ‘సరస్వతి’ సినిమా థియేటర్లలోకి రాబోతోందని చిత్ర బృందం తెలిపింది.

READ ALSO: Realme P4 Lite: కేవలం రూ.7,999 కే అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. కళ్లు చెదిరే ఫీచర్లు!