కులమతాలకు అతీతంగా రంగా జయంతి నిర్వహిస్తున్నారని, రాబోయే రోజుల్లో రంగా అభిమానులు ఐకమత్యం చూపించాలన్నారు వంగవీటి రాధాకృష్ణ. ప్రజలు రంగా గురించి మాట్లాడుతున్నారని, ఎవరూ డిమాండ్ చేయరు… అభిమానం ఉంటే చేయాలన్నారు. చైతన్య రథం సినిమా ఇక్కడ కూడా అభిమానుల కోసం వ్యాపార ధోరణి లేకుండా ప్రదర్శిస్తామన్నారు వంగవీటి రాధా. అనంతరం.. జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ మాట్లాడుతూ.. రంగాకి జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు అని, ఓట్ల రాజకీయాల కోసం గతంలో రంగా వర్ధంతులు జయంతులు చేసారు ఈ సీఎం అన్నారు. రంగా పేరిట ఒక పథకం, స్మృతివనం పెట్టాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేయాలన్నారు.
Also Read : India And Taiwan: ఇండియాకు సెమీకండక్టర్ పరిశ్రమ.. చైనా నుంచి తరలనున్న తైవాన్ కంపెనీ
రంగాకి నివాళులర్పించాలని సీఎం జగన్ ను వైసీపీ నేతలు డిమాండ్ చేయాలన్నారు. రాధా కు వెన్నుపోటు పొడిచిన వారికి త్వరలో రాధా గుండెపోటు తెప్పిస్తారని, వాళ్ళకి రాజకీయ సమాధి కడతారని ఆయన వ్యాఖ్యనాఇంచారు. రంగాకి నిజమైన వారసుడు రాధా అని, ప్రజలందరూ రంగాని గుండెల్లో నిలుపుకుని సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, రంగా ఒక సామూహిక శక్తి అని యువత భావిస్తున్నారన్నారు. ఒక మనిషి భౌతికంగా దూరమైనా కొన్ని తరాలకు స్ఫూర్తి ఇచ్చారు. నేటికీ రంగాను దేవుడిగా ఆదరించడం .. ఆయన చేసిన మంచిని చెబుతుంది. భవిష్యత్తులో రంగా అభిమానులు అందరూ ఐకమత్యం చూపాలి. రంగా పేరు చెప్పుకుని నాయకులుగా కొందరు ఎదిగారు.
Also Read : Prabhas : ప్రభాస్ కూడా జాతకాలను నమ్మతున్నాడా?