Site icon NTV Telugu

Vande Bharat: త్వరలో వందేభారత్‌ స్లీపర్‌.. ట్రయల్‌ రన్‌ ఎప్పుడంటే..!

Sleo

Sleo

దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. ఇందులో కేవలం సీట్లు మాత్రమే ఉంటాయి. అత్యంత వేగంగా.. తక్కువ సమయంలో గమ్యానికి చేరుస్తుంటాయి. అయితే త్వరలో వందేభారత్ స్లీపర్ కూడా పట్టాలపై పరుగులు పెట్టనుంది. ఈ రైళ్ల ట్రయల్‌ రన్‌ ఆగస్టు 15 నాటికి నిర్వహించనున్నట్లు రేల్వే వర్గాలు వెల్లడించాయి. దీంతో అతి త్వరలోనే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ స్లీపర్‌ ట్రయల్‌ రన్‌ పూర్తి చేసుకుని పట్టాలెక్కనుంది. ఇప్పటివరకు కూర్చొని ప్రయాణించేందుకు వీలుండే ఈ రైళ్లలో ఇక నుంచి స్లీపర్ల ఏర్పాటుతో మెరుగైన సేవలను కేంద్రం అందించనుంది. ఇతర రైళ్లతో పోలిస్తే.. ఈ ప్రీమియం రైలులో మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే సెమీ హైస్పీడ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఛైర్‌కార్‌ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య నడుస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Anjaamai: నటుడు విధార్థ్, వాణి భోజన్‌లను అరెస్ట్ చేయాలి.. కలకలం రేపుతున్న సినిమా వివాదం

Exit mobile version