NTV Telugu Site icon

Viral Video: వెజ్ ఆర్డర్ చేస్తే నాన్ వెజ్ ఫుడ్ ఇచ్చిన వెయిటర్‌.. చివరకు.?

Wayanad Landslides

Wayanad Landslides

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆహారం విషయంలో తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈసారి వెజ్‌కి బదులు నాన్‌వెజ్‌ ఫుడ్‌ ఇవ్వడంతో ఓ ప్రయాణికుడు వెయిటర్‌పై చిరుబుర్రులాడాడు. అంతేకాకుండా.. కోపంతో వెయిటర్‌ని ప్రయాణికుడు చెంపదెబ్బ కొట్టాడు. నిజానికి వెయిటర్ చేసిన తప్పు ఏంటంటే.. అతను వెజ్‌కి బదులుగా ప్యాసింజర్‌కి నాన్‌వెజ్‌ ఫుడ్‌ ఇచ్చాడు. దీంతో.. వెయిటర్‌పై ఆగ్రహించిన ప్రయాణికుడు రైలులోనే బీభత్సం సృష్టించాడు. ఈ ఘటన హౌరా-రాంచీ మధ్య చోటుచేసుకుంది. ప్రయాణంలో.. వెయిటర్ ఆహారంతో ప్రయాణికుడి వద్దకు వచ్చాడు. అయితే.. ప్రయాణీకుడు కంపార్ట్‌మెంట్‌పై ఇచ్చిన సూచనలను చదవకుండా తినడం ప్రారంభించాడు. ఆ తర్వాత అతను వెయిటర్‌ను పిలిచి రైలులో గొడవకు దిగాడు.

Rashid Khan: రషీద్ ఖాన్ @600 వికెట్లు..

రైలులో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ చేశాడు. ఈ వీడియో క్యాప్షన్‌లో.. “ఈ వ్యక్తి శాఖాహారుడు.. అతనికి నాన్ వెజ్ అందించబడింది. ఇది అతనికి కోపం తెప్పించింది. దీంతో.. వెయిటర్‌ను చెంపదెబ్బ కొట్టాడు” అని రాశాడు. ఈ వీడియోలో ప్రయాణికుడు చాలా కోపంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా.. వెయిటర్‌ని క్షమాపణ చెప్పమని పదే పదే అడిగాడు.

Chennai Drug seized: చెన్నైలో రూ.70 కోట్ల డ్రగ్స్ సీజ్.. ముగ్గురు అరెస్ట్

అయితే.. వెయిటర్ ఈ పొరపాటుకు ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పాడు. రైలులో ఉన్న ఇతర ప్రయాణికులు కూడా వెయిటర్ను క్షమాపణ చెప్పాలని కోరారు. మరోవైపు.. ఓ ప్రయాణికుడు ప్యాకెట్‌లో ఆహారం శాఖాహారమా కాదా అని రాసి ఉందని అతనికి చెప్పాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో యూజర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వెయిటర్ నీకంటే పేదవాడు, నీతో పోరాడలేడని, కాబట్టి అతనిపై మీ కోపాన్ని వెళ్లగక్కుతారా అని కామెంట్స్ చేస్తున్నారు.

Show comments