Site icon NTV Telugu

Vallabhaneni Vamsi : చంద్రబాబు పెద్ద సైకో.. లోకేష్ పిల్ల సైకో

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi

చంద్రబాబు పెద్ద సైకో.. లోకేష్ పిల్ల సైకో అని విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆడొళ్ల బొమ్మలతో నా ఫొటో పెట్టి వల్లభ వల్లభ అని పాటలు పెట్టే మానసిక దౌర్భల్యం లోకేషుదే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ కనుసన్నల్లో నడిచే ఐటీడీపీనే ఇలాంటి ట్రోలింగ్స్ చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. అంతేకాకుండా.. చంద్రబాబు, లోకేష్ ఆడొళ్లని అడ్డం పెట్టుకుని బతుకుతారని ఆయన మండిపడ్డారు. ఎన్టీఆర్ అల్లుడినని చంద్రబాబు, ఎన్టీఆర్ మనవడినని లోకేష్ పదే పదే చెప్పుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. ఖర్జూరపు నాయుడు కొడుకునని, మనవడినని చంద్రబాబు, లోకేషులు ఎందుకు చెప్పుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.

Also Read : Uttam Kumar Reddy : ఉమ్మడి మేళ్లచెరువు మండలాన్ని డెవలప్ చేసిన ఘనత నాదే

చంద్రబాబు, లోకేష్ లవి కృష్ణదేవరాయల డీఎన్ఏ ఏంటో అర్థం కావడం లేదని, ఎవరైనా డీఎన్ఏ అంటే తల్లిదండ్రుల పేర్లు చెబుతారు.. కానీ చంద్రబాబు, లోకేషులవి కృష్ణ దేవరాయలు డీఎన్ఏ అని టీడీపీ నేతలు ఎందుకు చెబుతున్నారో..? అని ఆయన ఎద్దేవా చేశారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో లోకేష్ ఎలా చదువుకున్నారో అందరికీ తెలుసు అని, లోకేష్ చదువులకు డబ్బెవరు పంపారో ప్రజలందరికీ తెలిసిందే అని ఆయన వ్యాఖ్యానించారు. పకోడి గాళ్లంతా నాకు డిపాజిట్ లేకుండా చూస్తామంటున్నారు.. వేరే వాళ్లెందుకు.. చంద్రబాబో.. లోకేషో రావచ్చు కదా..? అని ఆయన సవాల్‌ విసిరారు.

Also Read : Uddav Thackeray: ఎలక్షన్ కమీషన్ ప్రధాని మోదీకి బానిస.. మా “విల్లు-బాణం” దొంగిలించారు.

Exit mobile version