NTV Telugu Site icon

Vallabhaneni Vamshi: యార్లగడ్డ, దుట్టా వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ ఘాటు కౌంటర్

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamshi: గన్నవరం వైఎస్సార్‌సీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. వైసీపీ నేతలైన దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులపై మరోసారి మండిపడ్డారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. దుట్టా, యార్లగడ్డ ఏం మాట్లాడారో తాను చూడలేదని.. ఉదయం నుంచి సాయంత్రం వరకు గడప గడప కార్యక్రమంలో బిజీగా ఉన్నానన్నారు వంశీ.

పనీ పాట లేని వాళ్లు ఏదో ఒకటి మాట్లాడతారని.. ఈ వ్యాఖ్యలను హైకమాండ్ దృష్టికి తీసుకుని వెళ్ళాల్సి అవసరం లేదన్నారు. వీళ్లను ఎలా హ్యాండిల్ చేయాలో తనకు, కొడాలి నానికి తెలుసన్నారు. ఎక్కువగా మాట్లాడితే డొక్క పగల్దీసి డోలు కడతామని హెచ్చరించారు. వార్డుకు, పంచాయతీకి గెలవని వాళ్లు తనకు సహకరించేది ఏంటని ఎద్దేవా చేశారు.

AP High Court: దుర్గగుడి ఈవో భ్రమరాంబకు ఏపీ హైకోర్టు నోటీసులు

వంశీని, నానిని తిడితే పెద్ద వాళ్లం అవుతున్నాం అని వాళ్లే అంటున్నారుగా అని ఆయన చెప్పారు. టీడీపీలో నేను, నానీ ఎలా ఉన్నామో వైసీపీలో కూడా మా స్టైల్ అలానే ఉంటుందన్నారు. కళ్ళు చిదంబరం అద్దం ముందు నిలబడి మహేష్ బాబు అనుకుంటే అయిపోతారా అంటూ వ్యాఖ్యానించారు. అరగుండు బ్రహ్మానందం, అంకుశం రామిరెడ్డి మేం మహేష్ బాబు అనుకుంటే మహేష్ బాబులు అయిపోరు అంటూ ఎద్దేవా చేశారు. అద్దం ముందు నిలబడి చూసుకుంటే తెలుస్తుందన్నారు. క్లైమాక్స్ ముందే చెబితే సినిమా ఎవరూ చూడరన్నారు. తాను గన్నవరానికి ఏం చేశానో ఇక్కడి ప్రజలకు తెలుసన్నారు. వలస పక్షులకు ఏం తెలుస్తుందని ఆయన మండిపడ్డారు.

Show comments