Saba Nayagan : వాలంటైన్స్ డే స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీ అందుబాటులోకి వచ్చాక ప్రేక్షకుల కోసం సరికొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ సందడి చేస్తున్నాయి..తాజాగా ఈ ఏడాది వాలంటైన్స్ డేకు స్పెషల్‌గా “సబా నాయగన్”అనే ఓ రొమాంటిక్ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ లో కలర్ ఫొటో హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటించింది.భద్రమ్, మన్మధ లీల, పోర్ తొళిల్ మరియు పిజ్జా 2 సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో అశోక్ సెల్వన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.అశోక్ సెల్వన్, చాందినీ చౌదరి నటించిన ఈ లేటెస్ట్ మూవీ 2023లో డిసెంబర్‌లో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి టాక్ తెచ్చుకుంది.
రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించారు.సబా నాయగన్ మూవీలో అశోక్ సెల్వన్ మరియు చాందినీ చౌదరితో పాటు మరో హీరోయిన్స్‌గా మేఘా ఆకాష్ మరియు కార్తీక మురళీధరన్ నటించారు.. ఈ సినిమాతో సీఎస్ కార్తికేయ దర్శకుడిగా పరిచయం అయ్యారు.ఆయన గతంలో కమల్ హాసన్ విశ్వరూపం, విశ్వరూపం 2 చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు.. గతేడాది డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సబా నాయగన్ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.ఈ ఏడాది ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా ఈ రొమాంటిక్ డ్రామా అయిన సబా నాయగన్‌ను విడుదల చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఫిబ్రవరి 14 నుంచి సబా నాయగన్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే ఇంతకుముందు ఫిబ్రవరి 1 నుంచి సబా నాయగన్ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఫిబ్రవరి 14న స్ట్రీమింగ్ చేస్తే మేకర్స్‌కు మరియు ఓటీటీ సంస్థకు కలిసి వస్తుందని వాయిదా వేసి వాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నారు
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?