Valentine’s Day Shocker: వాలెంటైన్స్ డే సందర్భంగా భార్యాభర్తలు కలిసి డిన్నర్ చేశారు. అంతా సంతోషంగా ఉన్న తరుణంలో భార్య హత్యకు గురైంది. పలు కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు భర్తనే ఈ దారుణహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. భార్యను హత్య చేసి, దానిని దోపిడీగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కేవలం 18 గంటల్లోనే పోలీసులు ఈ హత్యను ఛేదించారు.
వివరాల్లోకి వెళ్తే, హర్యానాలోని బహదూర్‌గఢ్‌లో, బ్యాంకు ఉద్యోగిని మహాక్ హత్యకు గురైంది. చార్టర్డ్ అకౌంటెంట్ అన్షుల్ ధావన్ ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఆదివారం రాత్రి 11 గంటలకు గురుగ్రామ్‌లో పనిచేస అన్షుల్, గుర్తుతెలియన దుండగులు తమను దోచుకోవడానికి ప్రయత్నించారని, భార్య గొంతు కోశారని పోలీసులకు ఫోన్ చేశారు.
Read Also: Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కోసం పాక్ ప్రభుత్వానికి సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ లేఖ..
దర్యాప్తు ప్రారంభించిన ఝజ్జర్ పోలీసులకు, అన్షుల్ పొంతనలేని సమాధాలు చెప్పడంతో అనుమానించారు. ఎవరు దాడి చేశారో చెప్పలేకపోవడం, వాంగ్మూలాన్ని మార్చిమార్చి చెప్పడంతో పోలీసులకు మరిన్ని అనుమానాలు పెరిగాయి. తమదైన శైలిలో ప్రశ్నించడంతో అన్షుల్ తన భార్య మహాక్ ను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. గురుగ్రామ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పనిచేస్తున్న మహక్‌పై చాలా కాలంగా అన్షుల్ అనుమానాన్ని పెంచుకున్నాడు. ఇది తరుచూ ఇద్దరి మధ్య గొడవకు దారి తీసేదని పోలీసులు చెప్పారు.
మహాక్ తండ్రి కృష్ణ కథురియా మొదటి నుంచి తన అల్లుడు అన్షుల్‌పైనే అనుమానాన్ని వ్యక్తం చేశాడు. హత్య సమయంలో అన్షుల్ వేలిముద్రలు పడకుండా ఉండటానికి గ్లౌ్వ్స్ వేసుకుని, మహాక్ గొంతు నులిమి, ఆపై కత్తెరతో ఆమె గొంతును కోశాడు. హిసాన్ నివాసి అయిన అన్షుల్, హన్సికి చెందిన మహాక్‌కు గతేడాది సెప్టెంబర్ 25న వివాహం జరిగింది.
