Valentines Day 2026: ప్రేమికులకు బంపర్ వీకెండ్.. ఈ 5 రొమాంటిక్ ప్లేసెస్ ట్రై చేయండి..మీ పార్ట్నర్ ఫిదా అవ్వాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాలెంటైన్స్ డే అంటేనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఆత్మీయ అనుబంధాన్ని వేడుక చేసుకోవడం. ఇక ఈ సారి 2026 ఫిబ్రవరి 14 శనివారం నాడు రావడంతో, సెలవుల గురించి పెద్దగా ఆలోచించకుండానే ఒక చిన్నపాటి విహారయాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. కొందరు ముందే రిజర్వేషన్లు చేసుకుని సిద్ధంగా ఉంటే, మరికొందరు ఆఖరి నిమిషం వరకు వాయిదా వేస్తుంటారు. మీరు కూడా ఆ ‘లాస్ట్ మినిట్’ జాబితాలో ఉంటే, మీ భాగస్వామితో కలిసి ఏకాంతంగా గడపడానికి రొటీన్‌కు భిన్నంగా ఉండే కొన్ని ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి.
ప్రేమలో మునిగి తేలాలనుకునే జంటలకు కేరళలోని వాయనాడ్ ఒక స్వర్గధామం. దట్టమైన అడవులు, ఎత్తైన కొండల మధ్య ఉండే అందమైన రిసార్టులు మీ వీకెండ్‌ను కలర్ఫుల్గా మారుస్తాయి. కాస్త విభిన్నంగా ఉండాలనుకుంటే, కర్ణాటకలోని కూర్గ్ ఉత్తమ ఎంపిక. ఇక్కడి కాఫీ తోటలు, జలపాతాల హోరులో భాగస్వామితో గడిపే సమయం మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. సముద్ర తీరం.. సాహస యాత్రలను ఇష్టపడే వారు అండమాన్‌లోని హావ్ లాక్ ఐలాండ్‌ను సందర్శించవచ్చు. తెల్లని ఇసుక తిన్నెలు, స్కూబా డైవింగ్ వంటివి మీ ట్రిప్‌కు గ్రాండ్ లుక్ ఇస్తాయి.
Also Read
- YS Jagan: 'దిశ' లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
- Liquor Closed: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
- Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
- Ajinkya Rahane New Innings: రిటైర్మెంట్ రోజే స్టీవ్ వా ఫోన్.. రహానే కెరీర్‌కు కొత్త మలుపు
ఇక మంచులో ‘వైట్ వాలెంటైన్స్ డే’ జరుపుకోవాలనుకుంటే అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సరైన ప్రదేశం. మంచుతో కూడిన పర్వత శిఖరాలు, నిశ్శబ్దంగా ఉండే లోయలు ప్రేమికులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. ఇక హడావుడి లేకుండా హిమాలయాల అందాలను ఆస్వాదించాలనుకుంటే ఉత్తరాఖండ్‌లోని కౌసానికి వెళ్లొచ్చు. 1900 మీటర్ల ఎత్తులో ఉండే ఈ చిన్న పట్టణం నుంచి నందాదేవి శిఖరాలను చూడటం గొప్ప అనుభూతి. ఈ ఐదు ప్రదేశాల్లో ఏదో ఒకటి ఎంచుకుని, మీ భాగస్వామికి మర్చిపోలేని సర్ప్రైజ్ ఇవ్వండి.
తాజావార్తలు
-
YS Jagan: ‘దిశ’ లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
-
Liquor Closed: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
-
Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
-
Ajinkya Rahane New Innings: రిటైర్మెంట్ రోజే స్టీవ్ వా ఫోన్.. రహానే కెరీర్‌కు కొత్త మలుపు
-
Cricket Player: బోర్డును బురిడీ కొట్టించాలనుకున్నాడు.. చివరికి కెరీర్ క్లోజ్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!