Site icon NTV Telugu

Vaishnavi : జ్ఞాపకాలే మిగిలాయి.. వైష్ణవి ఎమోషనల్ పోస్ట్

Vaihshnavi Chaitanya

Vaihshnavi Chaitanya

‘బేబి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య, తాజాగా తన సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎపిక్’. ‘90s బయోపిక్’ సిరీస్‌తో తన మార్క్ చూపించిన డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయిన సందర్భంగా, వైష్ణవి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది. సెట్‌లో గడిపిన క్షణాలు, టీమ్ అందరితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈ సినిమా ప్రయాణం తనకు చాలా ప్రత్యేకమని చెప్పుకొచ్చింది.

Also Read :Shambala :’శంబాల’ సక్సెస్ మీట్‌లో.. ఆది సాయి కుమార్‌పై అల్లు అరవింద్ భారీ ప్రశంసలు

“ఈ సినిమాలో పని చేసిన ప్రతి నిమిషాన్ని నేను ఎంతో ఎంజాయ్ చేశాను. షూటింగ్ సమయంలో చిత్ర బృందం అంతా నాకు ఒక కుటుంబంలా మారిపోయారు. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది” అంటూ వైష్ణవి తన మనసులోని మాటను పంచుకుంది. ‘బేబి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ – వైష్ణవి మళ్లీ కలిసి నటిస్తుండటంతో ఈ ‘ఎపిక్’ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

 

Exit mobile version