Site icon NTV Telugu

Vaibhav Suryavanshi: అరెరే పెద్ద సమస్యే వచ్చిందే.. కారు గెలిచాడు కానీ.. మరో నాలుగేళ్లు..?

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడిన ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. 14 ఏళ్ల వయస్సులోనే తన మొదటి ఐపీఎల్ సీజన్‌లో తనదైన ముద్ర వేస్తూ గుర్తింపు పొందాడు. అతడు ఆడిన ఏడు మ్యాచ్‌లలో 252 పరుగులు చేసి, స్ట్రైక్ రేట్ 206.55తో ప్రత్యర్థి బౌలర్స్ కు చుక్కలు చూపించాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా ఐపీఎల్ నిర్వాహకులు అతడికి సూపర్ స్ట్రైకర్ అఫ్ ది సీజన్ గా పేర్కొంటూ బహుమతిగా కారుని అందజేశారు.

Read Also: Vidadala Rajini: ప్రజలకు ఏమీ చేయకుండా.. కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తోంది!

అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అందేంటంటే.. కారు గెలిచినా, వైభవ్ మరో నాలుగేళ్ల పాటు దానిని డ్రైవ్ చేయలేడు. ఎందుకంటే, భారతదేశంలో ఆర్టీఏ రూల్స్ ప్రకారం డ్రైవింగ్ వయస్సు కనీసం 18 ఏళ్లు ఉండాలి. ఇప్పుడు వైభవ్ వయస్సు కేవలం 14 ఏళ్లు మాత్రమే కావడంతో అతడు కారు నడపడానికి ఇంకా నాలుగేళ్లు వేచి ఉండాల్సిందే. అయినప్పటికీ, అతి చిన్న వయసులోనే ఐపీఎల్‌లో అతడు ఆడిన ఆటతీరు, సాధించిన రివార్డ్, అతని భవిష్యత్‌పై భారీ ఆశలను పెంచుతున్నాయి. వైభవ్‌కు ఇది ప్రారంభమే అంటూ, అతడి క్రికెట్ ప్రయాణంలో ముందు ముందు మరెన్నో మైలురాళ్లను దాటుతాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు.

Exit mobile version