Site icon NTV Telugu

Vaibhav Suryavanshi: ధోనీ-కోహ్లీ కాదు.. నాకు ఆదర్శం ఇతనే

Vaibhav

Vaibhav

అండర్-19 టెస్టులో సెంచరీ చేయడంతో వెలుగులోకి వచ్చిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ ఓవర్‌నైట్ స్టార్‌గా మార్చింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన మెగా వేలంలో వైభవ్‌ను ఫ్రాంచైజీ రూ.1 కోటి 10 లక్షలకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఇదిలా ఉంటే.. వైభవ్ సూర్యవంశీ కెరీర్‌లో భారత క్రికెట్ అత్యుత్తమ కెప్టెన్లు, కోచ్‌లలో ఒకరైన రాహుల్ ద్రవిడ్‌తో కలిసి పనిచేసే అవకాశం దొరుకుతుంది. ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే.. వైభవ్ సూర్యవంశీ తన ఆరాధ్యదైవంగా భారత్ దిగ్గజ క్రికెటర్లను వదిలేసి విదేశీ ప్రముఖ ఆటగాడి పేరు చెప్పాడు. ఇంతకు అతను ఎవరు.. వివరాలు తెలుసుకుందాం.

Read Alaso: US: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి బలి.. కాల్పుల్లో ఖమ్మం జిల్లా వాసి మృతి

వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా తన ఆరాధ్యదైవం అని వైభవ్ సూర్యవంశీ వెల్లడించాడు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ దుబాయ్‌లోని దుబాయ్ క్రికెట్ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఆసియా కప్-19 మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో.. మ్యాచ్‌కు ముందు సోనీ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో మీ హైప్, పేరు మార్మోగుతుంది అని కామెంటర్ వైభవ్ సూర్యవంశీని అడిగారు. వైభవ్ మాట్లాడుతూ “ప్రస్తుతం నేను నా ఆటపై దృష్టి పెడుతున్నాను. ముఖ్యంగా సోషల్ మీడియాలో నాపై జరుగుతున్న విష ప్రచారాలతో నేను బాధపడటం లేదు. ఆసియా కప్ పై దృష్టి పెట్టాలనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు. బీహార్‌కు చెందిన ఈ కుర్రాడు ఇటీవల చెన్నైలో ఆస్ట్రేలియా U-19తో జరిగిన యూత్ టెస్ట్‌లో అంతర్జాతీయ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడైన బ్యాటర్‌గా నిలిచాడు.

Read Alaso: OG : హైప్ తో చంపేస్తారా ఏంటీ.. ఓజీలో మరో స్టార్ హీరో..?

Exit mobile version