Vaibhav Suryavanshi: రెండు నుంచి మూడు వేల పరుగులు.. ప్లాన్ చెప్పిన వైభవ్.. పగలబడి నవ్విన తోటి ఆటగాళ్లు
- వైభవ్ ఐపీఎల్లో ఒక సీజన్ ఆడాడు
- గత సీజన్లో వైభవ్ 252 పరుగులు చేశాడు
- వైభవ్ 35 బంతుల్లో సెంచరీ సాధించాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో మరోసారి విధ్వంసం సృష్టించడానికి వైభవ్ సూర్యవంశీ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ గత సీజన్లో బ్యాట్‌తో విరుచుకుపడ్డాడు. 35 బంతుల్లో సెంచరీ సాధించడం ద్వారా, వైభవ్ ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ భారత బ్యాట్స్‌మెన్‌గా, సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. అండర్-19 ప్రపంచ కప్ 2026లో భారత్ విజయంలో వైభవ్ కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో 80 బంతుల్లో 175 పరుగులు చేశాడు. 14 ఏళ్ల వైభవ్ తన రెండవ ఐపీఎల్ సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ సీజన్లో అతని నుంచి మరో విధ్వంసకరమైన ఇన్నింగ్స్‌ను అభిమానులు ఆశిస్తున్నారు. ఐపీఎల్ 19వ సీజన్లో తన లక్ష్యం ఏమిటని ఒక జర్నలిస్ట్ అడిగారు. ఈ ప్రశ్నకు అతను చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్‌కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- Asim Munir: టెహ్రాన్‌కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
మీడియాతో సంభాషణ సందర్భంగా, ఒక జర్నలిస్ట్, “ఐపీఎల్ 2026 కోసం మీ ప్రణాళికలు ఏమిటి? అంటే, మీరు ఎన్ని పరుగులు చేయాలనుకుంటున్నారు, ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ కోసం మీ లక్ష్యం ఏమిటి?” అని అడిగారు. దానికి వైభవ్, “మీరు నన్ను అలాంటి ప్రశ్నలు అడిగితే, రెండు నుంచి మూడు వేల పరుగులు అని చెబుతాను” అని బదులిచ్చారు. ఇది విన్న ఇతర రాజస్థాన్ ఆటగాళ్లు పగలబడి నవ్వారు.
వైభవ్ మాట్లాడుతూ, “నేను పరుగుల కోసం ఎలాంటి నిర్దిష్ట లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదు. నేను ఆట తీరును గమనిస్తున్నాను, జట్టు కోసం ట్రోఫీని గెలవాలనుకుంటున్నాను. మేము వ్యక్తిగత లక్ష్యాలపై దృష్టి పెట్టడం లేదు. ఈ సీజన్లో బాగా రాణించడమే మా లక్ష్యం అని తెలిపాడు. 2025 సీజన్‌కు ముందు జరిగిన వేలంలో వైభవ్‌ను దక్కించుకోవడానికి రాజస్థాన్ రాయల్స్ రూ.1.1 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించింది. ఏడు మ్యాచ్‌లలో 36.00 సగటుతో, 206.56 స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు చేసి యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. గత సీజన్లో, వైభవ్ ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ సాధించాడు.
Typical Vaibhav 😂🔥 pic.twitter.com/3rkxF1WLFl
— Rajasthan Royals (@rajasthanroyals) March 21, 2026
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్‌కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్‌కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!