Vaibhav Suryavanshi: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ.. మొదటి ఆటగాడు!

  • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ
  • అతిపిన్న వయసులో హాఫ్ సెంచరీ బాదిన వైభవ్‌
  • 17 బంతుల్లో వైభవ్‌ హాఫ్ సెంచరీ
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అతిపిన్న వయసులో హాఫ్ సెంచరీ బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 14 సంవత్సరాల 32 రోజుల వయసులో వైభవ్‌ అర్ధ సెంచరీ బాదాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ తరఫున ఆడుతున్న వైభవ్‌.. 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 17 బంతుల్లో 6 సిక్సులు, 3 ఫోర్లతో అర్ధ శతకం చేశాడు.

ఐపీఎల్‌లో అతిపిన్న వయసులో హాఫ్ సెంచరీ బాదిన రికార్డు ఇంతకుముందు రియాన్ పరాగ్ పేరిట ఉండేది. 2019లో పరాగ్ 17 ఏళ్ల 175 రోజుల వయసులో అర్ధ సెంచరీ బాదాడు. ఇప్పుడు పరాగ్ రికార్డును వైభవ్‌ సూర్యవంశీ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో సంజు శాంసన్ (18 ఏళ్ల 169 రోజులు-2013), పృథ్వీ షా (18 ఏళ్ల 169 రోజులు-2018) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక ఐపీఎల్‌ 2025లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదిన ఆటగాడిగా కూడా వైభవ్‌ మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌ తరఫున రెండో ఆటగాడిగా నిలిచాడు.