Vaibhav Suryavanshi: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. మొదటి ఆటగాడు!
- ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
- అతిపిన్న వయసులో హాఫ్ సెంచరీ బాదిన వైభవ్
- 17 బంతుల్లో వైభవ్ హాఫ్ సెంచరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అతిపిన్న వయసులో హాఫ్ సెంచరీ బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 14 సంవత్సరాల 32 రోజుల వయసులో వైభవ్ అర్ధ సెంచరీ బాదాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్.. 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 17 బంతుల్లో 6 సిక్సులు, 3 ఫోర్లతో అర్ధ శతకం చేశాడు.
ఐపీఎల్లో అతిపిన్న వయసులో హాఫ్ సెంచరీ బాదిన రికార్డు ఇంతకుముందు రియాన్ పరాగ్ పేరిట ఉండేది. 2019లో పరాగ్ 17 ఏళ్ల 175 రోజుల వయసులో అర్ధ సెంచరీ బాదాడు. ఇప్పుడు పరాగ్ రికార్డును వైభవ్ సూర్యవంశీ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో సంజు శాంసన్ (18 ఏళ్ల 169 రోజులు-2013), పృథ్వీ షా (18 ఏళ్ల 169 రోజులు-2018) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక ఐపీఎల్ 2025లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదిన ఆటగాడిగా కూడా వైభవ్ మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున రెండో ఆటగాడిగా నిలిచాడు.
Also Read
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!