Kohli-Vaibhav: “డియర్ వైభవ్.. వెల్ డన్”.. వైభవ్ సూర్య వంశీకి విరాట్ కోహ్లీ స్పెషల్ గిఫ్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Gifts Autograph to Vaibhav Sooryavanshi: రాజస్థాన్ రాయల్స్ కింగ్ వైభవ్ సూర్య వంశీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. స్టార్ బౌలర్లకు చుక్కులు చూయించాడు. కేవలం 26 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేసి 300 స్ట్రైక్ రేట్‌తో ఆర్సీబీ బౌలింగ్ విభాగాన్ని చిన్నాభిన్నం చేశాడు. వైభవ్ బ్యాటింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్, కింగ్ కోహ్లీ ఈ కుర్రాడి నైపుణ్యాన్ని కొనియాడుతూ క్రేజీ గిఫ్ట్ ఇచ్చాడు. మైదానంలో వైభవ్ బ్యాటింగ్ పవర్‌ను స్వయంగా చూసిన కోహ్లీ, మ్యాచ్ ముగిసిన తర్వాత అతనికి ఒక మధుర జ్ఞాపకాన్ని అందించాడు. వైభవ్ అభ్యర్థన మేరకు కోహ్లీ రాజస్థాన్ రాయల్స్ క్యాప్‌పై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అంతేకాకుండా “డియర్ వైభవ్, వెల్ డన్” అంటూ ఒక ప్రత్యేక సందేశాన్ని కూడా ఆ క్యాప్‌పై రాశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
READ MORE: Madhubala biopic: సంజయ్ లీలా భన్సాలీ బిగ్ ప్లాన్.. మధుబాలగా మలయాళ భామ !
Also Read
- India vs Sri Lanka: ఒకప్పుడు భారత్‌కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
- India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
- Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
ఇక.. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో వైభవ్ కేవలం 4 మ్యాచ్‌ల్లోనే 200 పరుగులు పూర్తి చేసి, ప్రస్తుత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ‘ఆరెంజ్ క్యాప్’ దక్కించుకోవడం విశేషం. 203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వైభవ్ (78), ధ్రువ్ జురెల్ (నాటౌట్ 81) మెరుపులు రాజస్థాన్‌ను సునాయాసంగా గెలిపించాయి. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తన యువ ఓపెనర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. “వైభవ్‌కు బయట తిరగడం, రకరకాల వంటకాలు తినడం అంటే చాలా ఇష్టం. అతను ఇలాగే బ్యాటింగ్ చేస్తూ ఉంటే, అతనికి కావాల్సినవన్నీ మేము సమకూరుస్తాం. అతను ఇంకా చిన్న పిల్లాడే, అప్పుడప్పుడు అల్లరి పనులు చేస్తూ అందరినీ నవ్విస్తుంటాడు. అతనికి బ్యాటింగ్ అంటే పిచ్చి, అందుకే అతనికి సాధ్యమైనంత ఎక్కువ సమయం క్రీజులో గడిపేలా మేము ప్రోత్సహిస్తున్నాం” అని పరాగ్ సరదాగా పేర్కొన్నాడు.
Player of the Match ✅
Orange Cap ✅
An autograph from Kohli 🐐✅Good night to everyone and remember to keep believing in yourself no matter what 💗 pic.twitter.com/Up2BZuYObM
— Rajasthan Royals (@rajasthanroyals) April 10, 2026
తాజావార్తలు
-
Kollywood : శంకర్ దర్శకత్వంలో అజిత్ కుమార్ సినిమా?
-
India vs Sri Lanka: ఒకప్పుడు భారత్‌కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
-
Haryana Viral Video: జుట్టు పట్టుకుని ఈడ్చి.. కింద పడేసి.. భార్యపై నడిరోడ్డుపైనే భర్త ఎలా దాడి చేశాడంటే?
-
VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
-
Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!