Vaibhav Sooryavanshi: రికార్డ్స్ గురించే ఆలోచించలేదు.. అలా ఉండడంతో స్వేచ్ఛగా ఆడేసా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్ పవర్‌తో క్రికెట్ ప్రపంచానికి తానేంటో మరోసారి రుచిచూపించాడు. కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులు చేసి ప్రత్యర్థి జట్టు బౌలర్లపై దయా కనికరం లేకుండా వీరబాదుడు బాదాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్ ఏ జట్టు రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నీలో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో యూఏఈపై భారత్ A 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 53 బంతుల్లో 7 ఫోర్లు, 28 సిక్సర్లతో 204 పరుగులు చేశాడు. 384.90 స్ట్రైక్ రేట్‌తో పరుగుల వరద పారించాడు. అతడి విధ్వంసంతో 250 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ఏ జట్టు కేవలం 14.2 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న వైభవ్.. తన ప్రదర్శనపై స్పందించాడు. గత రెండు మ్యాచ్‌ల్లో మంచి ఆరంభం లభించినప్పటికీ.. భారీ స్కోరు చేయలేకపోయానని, ఈసారి మాత్రం ఎక్కువసేపు క్రీజులో ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో స్వేచ్ఛగా షాట్లు ఆడానని చెప్పాడు. బంతిని జాగ్రత్తగా గమనించి ఆడాలని తమ కోచ్ ఎప్పుడూ సూచిస్తుంటారని చెప్పుకొచ్చాడు.
Also Read
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
- Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
- UAE: యూఏఈలో బస్సు-ట్రక్కు ఢీ.. 13 మంది మృతి, మృతుల్లో భారతీయులు!
- Musi River Rejuvenation : మూసీ పునరుజ్జీవానికి ముహూర్తం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
ఇక తన డబుల్ సెంచరీ తర్వాత సంబరాలు చేసుకుంటారా? అని అడగ్గా.. అలాంటిదేమీ లేదని వైభవ్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం తన దృష్టంతా సెమీఫైనల్‌పైనే ఉందని, మంచి ఫామ్‌ను కొనసాగిస్తూ ఫైనల్లోనూ ఇలాంటి ప్రదర్శన చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. ప్రతి మ్యాచ్‌లో ఒత్తిడి ఉంటుందని, అయితే నాలుగైదు బంతులు ఆడిన తర్వాత అది తగ్గిపోతుందని తెలిపాడు. సీనియర్లు తనకు ఎంతో సహకరిస్తున్నారని తెలిపాడు. అలాగే తాను ఎలాంటి రికార్డ్స్ కోసం ఆడడం లేదని పేర్కొన్నాడు. ఇంకా బీహార్ జట్టుకు కెప్టెన్సీ చేయడం గురించి కూడా మాట్లాడుతూ.. అది చాలా సరదాగా ఉంది. ప్రస్తుతం జట్టు కూడా బాగా ఆడుతోందని.. ఇదే విధంగా తన ప్రదర్శనను కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్లు వైభవ్ పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డును కూడా సృష్టించాడు. లిస్ట్-A క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. కేవలం 28 బంతుల్లోనే శతకం పూర్తి చేసి ఆస్ట్రేలియా ఆటగాడు జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ పేరిట ఉన్న 29 బంతుల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్లో లభించిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న వైభవ్.. ఏకంగా డబుల్ సెంచరీ సాధించాడు. పాకిస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఓటమి ఎదుర్కొన్న భారత్ A.. యూఏఈపై భారీ విజయంతో తిరిగి పుంజుకుంది. మరోవైపు పాకిస్థాన్ ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకోగా, మూడు మ్యాచ్‌ల్లో రెండో విజయం సాధించిన భారత్ ఏ కూడా నాకౌట్ దశకు అర్హత సాధించింది.
THE 28 SIXES OF VAIBHAV SOORYAVANSHI. https://t.co/mDoJpxpATt
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 24, 2026
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: రికార్డ్స్ గురించే ఆలోచించలేదు.. అలా ఉండడంతో స్వేచ్ఛగా ఆడేసా..!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్నీ శుభాలే, డబ్బేడబ్బు!
-
CIA Cyber Attack: CIAపై భారీ సైబర్ దాడి.. అమెరికా నిఘా వ్యవస్థలో కలకలం!
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్‌పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!