Irfan Pathan: “ఓన్లీ పెద్ద బౌలర్లే టార్గెట్ చేస్తున్నాడు!”.. వైభవ్ బ్యాటింగ్ శైలిపై ఇర్ఫాన్ పఠాన్ సంచలన స్టేట్‌మెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Irfan Pathan: వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో సంచలనం సృష్టిస్తున్నాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు ముందు వరకు వైభవ్ దుమ్మురేపుతూ వచ్చాడు. కట్‌చేస్తే నిన్న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్కసారిగా వైభవ్ దూకుడుకు కళ్లెం పడింది. జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను సైతం అలవోకగా ఎదుర్కొని ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన ఈ కుర్రాడు.. ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. అన్‌క్యాప్డ్ ప్లేయర్ ప్రఫుల్ హింగే వేసిన తొలి బంతికే పెవిలియన్ చేరాడు. ఇక వైభవ్ బ్యాటింగ్ తీరుపై చర్చ మొదలైంది. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ గతంలో చేసిన వ్యాఖ్యలను నిజం చేసేలా బ్యాటింగ్ ఉంది. ఏప్రిల్ 10న ఇర్ఫాన్ ఎక్స్‌లో స్పందిస్తూ.. “ఈ కుర్రాడు కావాలనే పెద్ద బౌలర్లను టార్గెట్ చేస్తున్నాడా?” అని అనుమానం వ్యక్తం చేశాడు. బుమ్రా వంటి దిగ్గజాలను బౌండరీలకు తరలించిన వైభవ్, పెద్దగా అనుభవం లేని ప్రఫుల్ హింగే బౌలింగ్‌లో విఫలం కావడం పఠాన్ ‘థియరీ’కి బలం చేకూర్చింది. అయితే, అప్పట్లో అభిమానులు మాత్రం దీన్ని కొట్టిపారేశారు. బౌలర్ ఎవరన్నది ముఖ్యం కాదని, వైభవ్ ఎప్పుడూ వేగంగా పరుగులు సాధించాలనే లక్ష్యంతోనే ఆడతాడని వాదించారు. ఇక మరోసారి ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ఆ పాత ట్వీట్‌ను రీ ట్వీ్ట్ చేస్తూ “వైభవ్ సూర్యవంశీకి సంబంధించి నా సిద్ధాంతం తప్పేమీ కాదు.” అని పేర్కొన్నాడు. దీంతో ఈ చర్చ సోషల్ మీడియాలో మరింత ఊపందుకుంది.
READ MORE: Varanasi : జక్కన్నకు తలనొప్పిగా మారిన లీక్స్.. నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న వారణాసి వీడియో
Also Read
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
- IPL 2026 Playoff Tickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇక్కడ బుక్ చేసుకోండిలా..
- CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
- IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్‌పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
ఇదిలా ఉండగా.. ఇటీవల ఇర్ఫాన్ పఠాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని బీసీసీఐకి నివేదించాడు. ‘వైభవ్ సూర్యవంశీ ఓ యువ సంచలనం. 15 ఏళ్ల వయసులో వైట్ బాల్ క్రికెట్‌లో ఇలాంటి ప్రదర్శన మరెక్కడా చూడలేం. ‘నేను గతేడాది బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాను. ఇప్పుడు అతడి బౌలింగ్‌లో ఎక్కువ స్కోర్ చేసేందుకు ఎదురుచూస్తున్నాను’ అని గతంలో సూర్యవంశీ చెప్పాడు. ఇప్పుడు నిజంగానే చెప్పిందే చేసి చూపించాడు. వైట్ బాల్ క్రికెట్‌లో బుమ్రాను ఎదుర్కోవడం చాలా కష్టం. కానీ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఆ గోల్‌ను కూడా రీచ్ అయ్యాడు. కాబట్టి ఈ కుర్రాడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయడానికి ఎదురుచూడాల్సిన అవసరం లేదు. వెంటనే అతడిని టీమిండియాలోకి తీసుకోవడం ఉత్తమం. ఇలా అయితే వైభవ్ 20 ఏళ్ల పాటు ఈ వృత్తిలో కొనసాగగలడు’ అని ఇర్ఫాన్ వెల్లడించాడు.
So my theory for Vaibhav Suyanvanshi isn’t wrong 😉
— Irfan Pathan (@IrfanPathan) April 13, 2026
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్‌కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్‌ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!