Vaibhav Sooryavanshi: బుడ్డిడి క్రేజ్ మాములుగా లేదుగా.! క్రికెటర్స్ మాత్రమే కాదు WWE స్టార్స్ కూడనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో సృష్టిస్తున్న రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఎంతటి గొప్ప బౌలర్ బౌలింగ్ చేస్తున్న ఎలాంటి వత్తిడి లేకుండా కొడితే బంతి బౌండరీ దాటేలా బ్యాటింగ్ చేస్తున్నాడు. దీనితో క్రికెట్ ప్రపంచంలో ఈ బుడ్డోడి పేరు మారుమోగుతోంది. అయితే ఈసారి క్రికెట్ తో సంబంధం లేని ఆటతో మరోసారి వార్తల్లో నిలిచాడు వైభవ్.
ఈసారి క్రికెట్ ప్రపంచం మాత్రమే కాదు.. WWE అభిమానుల దృష్టిని కూడా ఆకర్షించాడు వైభవ్. ప్రముఖ WWE సూపర్ స్టార్ డ్రూ మెక్‌ఇంటైర్ జిమ్‌లో వర్కౌట్ చేస్తూ వైభవ్ సూర్యవంశీ జెర్సీ ధరించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్‌గా మారింది. నేడు జరగబోయే రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు ఈ వీడియో రావడంతో అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.
Also Read
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
WWEలో “ది చోజన్ వన్” (Chosen One)గా గుర్తింపు పొందిన డ్రూ మెక్‌ఇంటైర్.. తన కెరీర్ ప్రారంభంలోనే అనేక విజయాలను అందుకున్నాడు. అలాంటి స్టార్ వైభవ్ సూర్యవంశీ జెర్సీ ధరించడం ఇప్పుడు బుడ్డోడి క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో ఇప్పటికే 583 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. యశస్వి జైస్వాల్ (397 పరుగులు), ధ్రువ్ జురెల్ (458 పరుగులు) వంటి స్టార్ ఆటగాళ్లను కూడా అతను వెనక్కి నెట్టి టాప్ లో నిలిచాడు. ఇక డ్రూ మెక్‌ఇంటైర్ వీడియోపై సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది. WWE, IPL మధ్య వచ్చిన ఈ అనూహ్య కలయిక అభిమానులను ఉత్సాహపరుస్తుంది. ఇద్దరు స్టార్లకు సంబంధించిన ఈ వైరల్ మూమెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!