Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi

వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండరు! అంతర్జాతీయ క్రికెట్ రంగంలో ఏకంగా తుఫానులా దూసుకొచ్చి, తనదైన బ్యాటింగ్ శైలితో రికార్డులను బద్దలు కొడుతున్న ఈ పదిహేనేళ్ల కుర్రాడు ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఊహకందని రీతిలో రికార్డుల మోత మోగిస్తూ, ఊహకందని వేగంతో ఎదుగుతున్న ఈ యువ సంచలనం కేవలం మైదానంలోనే కాకుండా వ్యాపార, వాణిజ్య ప్రపంచంలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. చిన్న వయసులోనే కోట్లాది రూపాయల బ్రాండ్ విలువను సొంతం చేసుకుంటూ చరిత్ర సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన అధ్యాయంగా నిలిచింది.

ఐపీఎల్ 2026 సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన వైభవ్ సూర్యవంశీ, ఆ టోర్నమెంట్‌లో ఆరెంజ్ క్యాప్‌తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’, ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ అవార్డులను కైవసం చేసుకున్నాడు. ఈ మెరుగైన ప్రదర్శనే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. బీహార్‌ కు చెందిన ఈ యువ బ్యాటర్ బ్రాండ్ వాల్యూ ఇప్పుడు రోజుకు ఏకంగా 1.5 కోట్ల నుంచి 2 కోట్ల రూపాయలకు చేరుకుంది. క్రికెట్ చరిత్రలోని సాంప్రదాయ నిబంధనలన్నింటినీ తలకిందులు చేస్తూ, ఇతని రేటు కార్డ్ ప్రస్తుతం పదేళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ అంతర్జాతీయ ఆటగాళ్లతో సమానంగా నిలిచింది.

నివేదికల ప్రకారం.. ప్రసారాల సమయంలో వైభవ్ సూర్యవంశీ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ స్థాయికి సమానంగా ఉందని తేలింది. అయితే.. ఇంత చిన్న వయసులో అతనికి దక్కుతున్న ఈ భారీ స్థాయి రేటింగ్స్ పట్ల మార్కెట్ నిపుణులు కొన్ని ఆందోళనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. 18 ఏళ్లు నిండకముందే ఒక ఆటగాడిపై ఇంత భారీ మొత్తంలో బ్రాండ్లు పెట్టుబడులు పెట్టడం భవిష్యత్తులో కొన్ని సవాళ్లకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఆటగాడి ఫామ్ లేదా చట్టపరమైన నిబంధనల విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల కొంత అనిశ్చితి నెలకొనే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రముఖ స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థకు చెందిన నిపుణుల అంచనా ప్రకారం.. రాబోయే రెండు సంవత్సరాల పాటు వైభవ్ సూర్యవంశీ ఇదే రకమైన ఫామ్‌ను కొనసాగిస్తే, ఆయన ఎండోర్స్మెంట్ ఆదాయం రోజుకు ఏకంగా 3 నుంచి 4 కోట్ల రూపాయలకు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు ఆయన దేశంలోని అత్యంత ధనిక , అగ్రశ్రేణి సెలబ్రిటీల సరసన నిలుస్తాడు. ప్రస్తుతం వైభవ్‌కు ఎలాంటి అధికారిక ఏజెంట్లు లేనప్పటికీ, ఆయన కుటుంబ సభ్యులతో పాటు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్ ఆయన వాణిజ్య విషయాలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నాయి. అతి చిన్న వయసులోనే కెరీర్ ఒత్తిడికి గురికాకుండా తగిన సలహాలు ఇస్తూ, ఆయనను సరైన మార్గంలో నడిపిస్తున్నాయి. మొత్తానికి, వైభవ్ సూర్యవంశీ క్రికెట్ రికార్డులతో పాటు బ్రాండ్ మార్కెట్‌లోనూ తన ప్రభంజనాన్ని కొనసాగిస్తూ సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాడు.