Vaibhav Sooryavanshi: 15 సిక్సర్లు, 15 ఫోర్లు.. ఏంటయ్యా వైభవ్.. నీ దెబ్బకు ప్రత్యర్ధులు కెరియర్ కోల్పోవాలా ఏంటి?

  • అండర్-19 వరల్డ్‌కప్ 2026 ఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ చారిత్రక ఇన్నింగ్స్
  • 80 బంతుల్లో 175 పరుగులు చేసిన 14 ఏళ్ల ఓపెనర్
  • ఇన్నింగ్స్‌లో 15 సిక్సర్లు, 15 ఫోర్లు
  • 55 బంతుల్లో సెంచరీ పూర్తి
  • భారత తరఫున వేగవంతమైన ఫైనల్ సెంచరీ
  • అండర్-19 వరల్డ్‌కప్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ..
Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi: అండర్-19 వరల్డ్‌కప్ 2026 ఫైనల్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ ఆయుష్ మహాత్రే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీనితో బ్యాటింగ్ మొదలు పెట్టిన టీమిండియాకు మంచి ఆరంభం లభించింది. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ “నభూతో నభవిష్యత్” అన్నట్లుగా రెచ్చిపోయాడు. మరొకసారి తన అద్భుత ఇన్నింగ్స్‌ తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు మరోసారి తిప్పుకున్నాడు. ఇలా ఎన్ని చెప్పిన తక్కువే వైభవ్ ఇన్నింగ్స్ చూస్తే. అవును ఇంగ్లాండ్‌ తో హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఈ 14 ఏళ్ల ఓపెనర్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఎన్నో రికార్డులు బద్దలుకొట్టాడు.

Vaibhav Sooryavanshi: అలసట లేదు, టెన్షన్ లేదు.. బీహార్ ‘బాద్‌షా’ వైభవ్‌ నేపథ్యం ఇది!

ఇక ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో వైభవ్ కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉండటం చుడితే అతడి బ్యాటింగ్ ఏ రేంజ్ లో చేసాడో అర్థం చేసుకోవచ్చు. ఏకంగా 218.75 స్ట్రైక్‌ రేట్‌ తో బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి బౌలర్లకు ఫ్యూచర్లో వారి కెరియర్ ను ప్రశ్నార్ధకం చేసాడంటే నమ్మండి. డబుల్ సెంచరీకి చేరువైనప్పటికీ చివరకు 175 పరుగుల వద్ద అతని ఇన్నింగ్స్ ముగిసింది. దీనితో అండర్ 19 చరిత్రలో ఒక్క ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రికార్డుకు ఎక్కాడు.

ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ కేవలం 55 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి అండర్-19 వరల్డ్‌ కప్ చరిత్రలో భారత్ తరఫున అత్యంత వేగంగా శతకం చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 2022లో రాజ్ అంగద్ బావా (69 బంతులు) పేరిట ఉన్న రికార్డును వైభవ్ అధిగమించాడు. అండర్-19 వరల్డ్‌కప్ మొత్తం చరిత్రలో చూస్తే ఇది రెండో వేగవంతమైన సెంచరీ. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాడు విల్ మలాజ్చుక్ (51 బంతులు) మొదటి స్థానంలో ఉన్నాడు.

Vaibhav Sooryavanshi Century: వరల్డ్‌కప్ ఫైనల్లో సెంచరీలు.. చరిత్రలో నిలిచిపోయిన ఇన్నింగ్స్‌లు ఇవే!

వైభవ్ సూర్యవంశీ సాధించిన రికార్డులు:
* అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్‌లో 150+ స్కోరు చేసిన తొలి ఆటగాడు.

* ఫైనల్‌లో అత్యంత వేగవంతమైన భారత సెంచరీ (55 బంతులు)

* ఒకే ఇన్నింగ్స్‌లో 15 సిక్సర్లు నమోదు

* ఒకే ఇన్నింగ్స్‌లో 150 పరుగులు (15 సిక్సర్లు, 15 ఫోర్లు) బౌండరీలతో రావడం.

* టోర్నమెంట్‌లో మొత్తం 449 పరుగులతో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్

* మొత్తం టోర్నమెంట్‌లో 30 సిక్సర్లు కొట్టి సరికొత్త రికార్డు.

చిచ్చరపిడుగు Vaibhav Sooryavanshi విశ్వరూపం.. ఫైనల్ లో సెంచరీ.. బద్దలైన రికార్డ్స్ ఇవే!

అండర్-19 వరల్డ్‌కప్ 2026లో వైభవ్ మొత్తం 41 ఫోర్లు, 30 సిక్సర్లు బాదాడు. ఈ ఫైనల్‌ కు భారత్ అఫ్గానిస్థాన్‌ పై సెమీఫైనల్‌ లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి చేరగా, ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాను 27 పరుగులతో ఓడించి ఫైనల్‌ లో అడుగు పెట్టింది. ఇక ప్రస్తుతం టీమిండియా 32 ఓవర్లలో 288 పరుగులతో బ్యాటింగ్ చేస్తుంది.