Srisailam: శ్రీశైలం మల్లన్న భక్తులకు దేవస్థానం అధికారులు వడ ప్రసాదం అందుబాటులోకి తీసుకుని వచ్చారు. 45 గ్రాముల వడ 20 రూపాయల ధరతో భక్తులకు దేవస్థానం విక్రయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పులిహోర, లడ్డులతో పాటు నేటి నుంచి వడ ప్రసాదం కూడా భక్తులకు అందుబాటులో ఉంటుంది. శ్రీస్వామి అమ్మవార్లకు పూజాదికాలు చేసి వడ ప్రసాదం శ్రీశైలం ఈవో లవన్న ప్రారంభించారు.
Also Read: TTD: గోవిందరాజస్వామి రథం సేఫ్.. విష ప్రచారాలు నమ్మొద్దు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు వచ్చి భగవంతునికి పూజ చేసి దర్శించుకునే వెళుతూ ఉంటారు. ఇలా ప్రతి రోజు వచ్చే భక్తుల కోసం పులిహోర, లడ్డులతో పాటు వడ ప్రసాదం తయారు చేయిస్తామని ఈవో లవన్న పేర్కొన్నారు. భక్తులకు ప్రసాదాల కొర లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు.