Site icon NTV Telugu

V. Hanumantha Rao: ప్రధాని దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు

V Hanumantha Rao

V Hanumantha Rao

V.Hanumantha Rao: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలైంది. లోక్ సభ ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేంద్రంపై విరుచుకు పడుతున్నారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమేరకు నెరవేర్చారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ దేశాన్ని ముక్కలు చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు. ఆయన రోజుకో కొత్త మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల పుస్తె మట్టెలు తీసుకుంటారని ప్రధాని అన్న మాటలను గుర్తు చేశారు. ఇప్పుడు ఇంకో కొత్త మాట చెప్తున్నారన్నారు.

READ NORE: PM Modi: బతికి ఉన్నవారిని, చనిపోయినవారిని దోచుకోంది.. శామ్ పిట్రోడాపై పీఎం ఆగ్రహం..

ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటన్నా నెరవేర్చారా..? అని నిలదీశారు. అయోధ్య రామమందిరాన్ని చెప్పుకొని ఓట్లు అడుగుతారా అని ప్రశ్నించారు. సంవత్సారానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని మండిపడ్డారు. ప్రజల పరిస్థితి ఎలా ఉందొ పట్టించు కోవడం లేదని.. వారిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బీజేపీ నాయకులకు జై శ్రీరామ్ అనే నినాదం తప్పా ఇంకొకటి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అయితే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.

Exit mobile version