Site icon NTV Telugu

V. Hanumantha Rao: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉందని.. భద్రాచలం దేవస్థానాని ఆహ్వానం ఇవ్వలేదు..

Vh

Vh

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనే వివక్షతోనే భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంకు అయోధ్య నుంచి ఆహ్వానం అందలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుని దగ్గర రాజకీయాలు తగదని దేవుడు ముందు అందరూ సమానమేనని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు..

Read Also: Ram Mandir PranPrathistha: అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ.. స్సెషల్‌ విషెస్‌ చెప్పిన దక్షిణాఫ్రికా క్రికెటర్!

అయోధ్య తర్వాత అంతటి చరిత్ర కలిగిన ఏకైక దేవస్థానం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అని అని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. దక్షిణ భారతదేశ అయోధ్యగా పిలవబడుతున్న ఈ దేవస్థానమునకు ఆహ్వానం రాకపోవడం చాలా విచారకరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బీజేపీ పార్టీ ఇలాంటి నీచమైన ఆలోచన చేయడం సిగ్గు చేటు అని విమర్శించారు. భద్రాచల రామాలయానికి ఆహ్వానం పంపించకపోవడంతో తెలంగాణను అవమానించడమేనని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version