Site icon NTV Telugu

V. Hanumantha Rao : పదేళ్లు బీఆర్‌ఎస్‌కి అధికారం ఉన్నా.. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు

Vh

Vh

కేటీఆర్‌కి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వి. హనుమంతరావు కౌంటర్ ఇచ్చారు. పదేళ్లు బీఆర్‌ఎస్‌కి అధికారం ఉన్నా.. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాం అంటే తొలగిస్తాం అంటున్నాడని ఆయన మండిపడ్డారు. విదేశాల్లో చదువుకున్న వ్యక్తివి.. ఇవేం బుద్దులు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సర్కార్ వచ్చిన తర్వాత మీరు ఏం విగ్రహం పెట్టుకుంటారో పెట్టుకోండి అని ఆయన వ్యాఖ్యానించారు. ఎయిర్ పోర్ట్ పేరు మారుస్తాం అని అనవరస మాటలు మాట్లాడకు అని ఆయన అన్నారు. మీ నాన్నకి రాజకీయం భిక్ష రాజీవ్ గాంధీ తోనే అని, నీ స్థాయి నువ్వే తగ్గించుకునే మాటలు మాట్లాడటం మానుకో అని హనుమంతరావు హితవు పలికారు. త్యాగం చేసిన రాజీవ్ గాంధీ పేరు మారుస్తా అనకు అని, మరోసారి రాజీవ్ గాంధీ గురించి మాట్లాడితే నీకే అవమానం అని ఆయన అన్నారు. మేము కూడా మాట్లాడతాం.. దెబ్బకు దెబ్బ మా కల్చర్ కాదని ఆయన అన్నారు.

Ruhani Sharma: వామ్మో, రుహానీ ఏంటి ఇలా చేసింది.. వీడియోలు వైరల్!

Exit mobile version