Site icon NTV Telugu

V.Hanumantha Rao : నయీం కేసు మళ్లీ తెరిచి విచారణ జరిపించాలి

Vh

Vh

నయీం కేసు మళ్లీ తెరిచి విచారణ జరిపించాలన్నారు మాజీ ఎంపీ వి హనుమంత రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నయీం కేసులో ఇన్వాల్వ్ అయిన పోలీస్ అధికారులు ఎవరు? నాయకులు ఎవరనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసును నీరుగార్చారని, బయట పడ్డ వందల కోట్ల డబ్బులు, పేద ప్రజల దగ్గర లాక్కున్న భూములు ఎక్కడికి పోయినవని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు ఎన్ని, పేద ప్రజల భూములు ఎన్ని తేలాలన్నారు.

CM Jagan: మళ్లీ ముగ్గురు కూటమిగా వస్తున్నారు.. ఒకసారి ఆలోచించండి!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని నయిమ్ కేసును విచారణ జరిపించాలని కోరుతున్నానన్నారు. పేద ప్రజల భూమిని వాళ్లకు తిరిగి ఇవ్వాలని రేవంత్ రెడ్డికి మనవి, ఆ భూమిలో పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇవ్వాలని విజ్ఞప్తి చేసున్నానని, ఫోన్ ట్యాపింగ్ ద్వారా పెద్ద కుంభకోణం జరిగిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దేశంలోనే సంచలనంగా మారిందని, ఫోన్ ట్యాపింగ్ లో పెద్ద నాయకులు అందరూ బయటకు వస్తున్నారన్నారు. ఇప్పటికే పోలీస్ అధికారులు జైలుకు పోయారని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ప్రభుత్వం ఎవ్వరిని వదిలి పెట్టదన్నారు వీహెచ్‌.

GT vs PBKS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్.. ఇరు జట్లలో మార్పు

Exit mobile version