NTV Telugu Site icon

Uttarkashi Avalanche: ఉత్తరకాశీ హిమపాతం ఘటనలో 26కు చేరిన మృతుల సంఖ్య

Uttarkashi Avalanche

Uttarkashi Avalanche

Uttarkashi Avalanche: ఉత్తరాఖండ్ లో హిమపాతంలో చిక్కుకున్న వారికోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అటు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్లను సహాయక చర్యల కోసం వినియోగిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి గాలింపు చ‌ర్యలు నిర్వహిస్తుండగా ఇప్పటివరకు మొత్తం 26మంది చనిపోయారు. వారి మృతదేహాలు ఇప్పటికే తరలించినట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. కాగా, మంగ‌ళ‌వారం నుంచి సెర్చింగ్ ఆప‌రేష‌న్ నిర్వహిస్తుండ‌గా అదేరోజు నాలుగు మృత‌దేహాలు ల‌భ్యమ‌య్యాయి. బుధ‌వారం ఒక్కబాడీ కూడా ల‌భించ‌లేదు. గురువారం 15 మృత‌దేహాల‌ను, శుక్రవారం సాయంత్రం నాలుగు గంట‌ల వ‌ర‌కు మ‌రో 7 మృత‌దేహాలను వెలికితీశారు.

Read Also: Flight Tickets: టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఫ్లైట్ టిక్కెట్లు ఫ్రీ

క‌శ్మీర్‌లోని ఓ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్న ట్రెయినీ ప‌ర్వతారోహ‌కులు గ‌త మంగ‌ళ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు ఉత్తర‌కాశీలోని ఓ ప‌ర్వత బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. అనంత‌రం ప‌ర్వతాన్ని అధిరోహించ‌డం మొద‌లుపెట్టారు. ఈ క్రమంలో 16 వేల అడుగుల ఎత్తుకు వెళ్లిన త‌ర్వాత ఒక్కసారిగా హిమ‌పాతం సంభ‌వించింది. ట్రెయినీ మౌంటెనీర్స్ అంతా ఆ మంచు దిబ్బల కింద గ‌ల్లంత‌య్యారు. స‌మాచారం అందుకున్న అధికారులు వెంట‌నే రెస్క్యూ టీమ్స్‌ను రంగంలోకి దించారు. ఆర్మీ, నేష‌న‌ల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌, ఉత్తరాఖండ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌, ఇండో టిబెట‌న్ బార్డర్ పోలీస్ త‌దిత‌ర బృందాలు స‌హాయ‌క చ‌ర్యులు నిర్వహిస్తున్నాయి.

Read Also: Strongest Man: వామ్మో!.. ఏకంగా 548కిలోలు ఎత్తేశాడుగా

వీళ్లంతా శిఖరం అధిరోహించేందుకు ఎత్తైన పర్యతాలకు వెళ్లారు. అటు వాతావరణం అనుకూలించకపోవటంతో…సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. అటు హిమపాతంలో చిక్కుకున్న పర్వాతారోహకులు ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. వీళ్లంతా నెహ్రూ మౌంటేనీరింగ్ ఇనిస్టిట్యూట్‌లో ట్రైనీలుగా ఉన్నారు. కాగా, మంచులో చిక్కుకున్న వారిలో 8 మందిని ఇప్పటివరకు సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిస్థితిపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పర్యవేక్షిస్తున్నారు.