బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను తిరిగి నియమించారు. మాయావతి గత ఏడాది డిసెంబర్‌లో ఆకాష్‌ను తన వారసుడిగా ప్రకటించినా, మే నెలలో ఎన్నికల సమయంలో కేసు కారణంగా బాధ్యతల నుంచి తొలగించారు. తాజాగా, బీఎస్పీకి లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నేపథ్యంలో ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో ఆకాష్‌ను మళ్లీ జాతీయ సమన్వయకర్తగా నియమించినట్లు సీనియర్ నేత సర్వర్ మాలిక్ తెలిపారు. మరికొన్ని వివరాల కోసం కింద వీడియో చూడండి..