Site icon NTV Telugu

Uttar Pradesh : మొదటి రాత్రే చివరిరాత్రి.. గుండెపోటుతో నవదంపతులు మృతి..

Newcouple Death

Newcouple Death

పెళ్లి అనే సంతోషం ఓ జంటకు కొద్ది గంటలు కూడా ఉండలేదు.. పెళ్లి జరిగిన రోజే ఇద్దరు గుండె పోటుతో మరణించారు.. నవదంపతులు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయాలు అలుముకున్నాయి.. ఘనంగా పెళ్లి చేశారు.. కనీసం ఒక్కరోజు కూడా ఉండకుండా చనిపోవడంతో వాళ్ల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.. ఈ విషాద ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది.. ఉత్తరప్రదేశ్ లోని బహ్రైచ్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది.

 

22 ఏళ్ల ప్రతాప్ యాదవ్ 20 ఏళ్ల పుష్పకి ఘనంగా పెళ్లి జరిగింది. కొత్త జంటని వరుడు ఇంటి వారు ఘనంగా ఆహ్వానించారు. అందరూ విందు ఆరగించి నిద్రపోయారు. తెల్లవారినా వధూవరులు తలుపు తెరిచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు తలుపులు పగలగొట్టి అక్కడి సీన్ చూసి షాకయ్యారు. పెళ్లికూతురు, పెళ్లికొడుకు విగత జీవులుగా పడి ఉండటం వారిని షాక్‌కి గురి చేసింది…

 

పోలీసులకు సమాచారం అందించగా.. వారు అక్కడకు చేరుకొని మృతదేహలను పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు..ఇద్దరూ గుండెపోటుతో చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఇద్దరికీ ఒకే చితిపై అంత్యక్రియలు నిర్వహించారు.అయితే ఈ జంటకు ఇంతకు ముందు గుండెకు సంబంధించిన ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని తెలుస్తోంది. ఈ జంట మరణాల మిస్టరీని ఛేదించేందుకు లక్నోలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో తదుపరి పరీక్షల కోసం ఇద్దరి మృతదేహాల లోపలి భాగాలను భద్రపరిచినట్లు తెలిపారు.. త్వరలోనే ఈ కేసును చేదిస్తామని తెలిపారు..

Exit mobile version