Immoral Relationship : అనైతిక సంబంధాలు వల్ల జరిగే నేరాలు కొత్తేమీ కాదు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో అలాంటిదే జరిగింది. ఓ వ్యక్తితో తల్లి ఆ స్థితిలో చూసి పిల్లలు ఆగ్రహ ఆవేశాలు కట్టలు తెంచుకున్నాయి. దాంతో తల్లి ప్రేమికుడిని దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన విజయ్‌ఘర్ థానేలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: Road Accident:ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆ మహిళకు రామ్ ఖిలాడీ(55)తో అనైతిక సంబంధం ఉంది. ముగ్గురు పిల్లలు.. ఓ గదిలో తల్లిని అలాంటి స్థితిలో చూశారు. ఆ తర్వాత హత్య చేసి మృతదేహాన్ని ఇంట్లో దాచిపెట్టారు. అయితే గ్రామానికి చెందిన ఓ బాలుడు ఇంటికి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రామ్ ఖిలాడీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటన తర్వాత నిందితులంతా పరారయ్యారు. ఈ కేసులో ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం కూడా గాలింపు ప్రారంభించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కొందరి వాంగ్మూలాలను సేకరించారు. ఘటనకు సంబంధించిన పంచనామా పూర్తి చేశారు.
Read Also:Punjab: పంజాబ్‌లో పరిస్థితి ఆందోళనకరమట.. కెనడా, యూకే ఎంపీల మొసలి కన్నీరు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడికి మహిళతో అనైతిక సంబంధం ఉందని తేలింది. ఘటన జరిగిన రోజు ఆ మహిళ పిల్లలు ఆమెను అవాంఛనీయ స్థితిలో చూశారు. దీంతో ఆవేశంతో తల్లి ప్రేమికుడిని పిల్లలు హతమార్చారు. వీరిద్దరి మధ్య అనైతిక సంబంధం కారణంగా డబ్బు ఇచ్చిపుచ్చుకుంటున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మృతుడి కుటుంబీకుల సమాచారం మేరకు పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉంది.
