Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Uttar Pradesh Horror Man Kills Wife And Three Children Before Hanging Himself In Shravasti

Uttar Pradesh: అమానుషం.. భార్య, ముగ్గురు పిల్లలను హతమార్చి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న భర్త..!

Published Date :November 14, 2025 , 6:53 pm
By Kothuru Ram Kumar
Uttar Pradesh: అమానుషం.. భార్య, ముగ్గురు పిల్లలను హతమార్చి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న భర్త..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Uttar Pradesh: తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో కలతపరిచే సంఘటన చోటు వేసుకుంది. నేడు (శుక్రవారం) ఉదయం శ్రావస్తి జిల్లాలోని కైలాసపూర్ మజ్రా మనిహార్ తారా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తుల మృతదేహాలు ఇంట్లో నుండి బయటపడ్డాయి. పోలీసుల సమాచారం ప్రకారం.. మృతులు రోస్ అలీ అలియాస్ రఫిక్, అతని భార్య షహ్నాజ్, పిల్లలు తబస్సుం, మొయిన్, గుల్నాజ్‌గా గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో రోస్ అలీ ముందుగా భార్య, పిల్లలను గొంతు నులిమి హత్య చేసి, అనంతరం ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. రోస్ అలీ కుటుంబంతో ముంబైలో నివసించేవాడు. తన చెల్లెలి వివాహానికి సంబంధాలు చూడడానికి వారం రోజుల క్రితమే గ్రామానికి వచ్చాడు. దాదాపు ఏడాది తర్వాత స్వగ్రామానికి చేరుకున్న ఈ కుటుంబాన్ని ఇలా విషాదం చుట్టుకోవడం గ్రామస్థులను కలచివేసింది.

Vaibhav Suryavanshi Century: వైభవ్ సూర్యవంశీ తుఫాన్ సెంచరీ.. 31 బంతుల్లో 100

శుక్రవారం ఉదయం ఇంటి గది లోపల నుంచి లాక్ అయ్యి ఉండటంతో అనుమానం వచ్చిన బంధువులు, గ్రామస్తులు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని ఎవ్వరూ ఊహించలేకపోయారు. రోస్ అలీ ఫ్యాన్‌కు ఉరివేసుకోగా.. పక్కనే మంచంపై భార్య షహ్నాజ్, ముగ్గురు చిన్నారుల మృతదేహాలు కనిపించాయి. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రాహుల్ భాటి తెలిపిన ప్రకారం.. గది లోపల నుంచి లాక్ అయి ఉండటం, ఘటన స్థితి దృష్ట్యా రోస్ అలీ భార్య, పిల్లలను దిండు లేదా చేతులతో గొంతు నులిమి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Bhumana Karunakar Reddy: సీబీఐ విచారణ వేసే దమ్ము ఉందా.? మాజీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్..!

ప్రాథమిక విచారణలో భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ ఈ ఘోర నిర్ణయానికి దారితీసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇతర కోణాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపించారు. ఒకే కుటుంబం ఐదుగురు ఇలా మృతిచెందడం గ్రామంలో విషాద మేఘాలు కమ్ముకున్నాయి. సంఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Crime News
  • Kailashpur Majra incident
  • man kills family
  • Shravasti family death
  • UP murder suicide

తాజావార్తలు

  • Vishnu Priya : విష్ణు ప్రియా అందాల వేడికి సోషల్ మీడియా షేక్

  • Harish Rao: మాజీ మంత్రి హరీష్‌రావు అరెస్ట్.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఫైర్‌..

  • Aditya Dhar: అతను నాకు తమ్ముడు లాంటి వాడు.. శాశ్వత్ సచ్‌దేవ్‌పై ఆదిత్య ధర్ ప్రశంసలు!

  • No Traffic Lights Country: ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం.. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఆ కంట్రీ ఏదంటే..?

  • Water Bottle Cleaning Tips: ప్లాస్టిక్ బాటిల్స్‌ ఫ్రిజ్‌లో పెడుతున్నారా..? అయితే ఇది మీ కోసమే..!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions