Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లో ఘోరం.. భవనం పైభాగం కూలి ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం సంభవించింది. మధురలోని బాంకే బిహారీ దేవాలయం సమీపంలో మంగళవారం సాయంత్రం పెను ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా మూడంతస్తుల భవనం పైభాగం కూలిపోవడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన ఐదుగురిలో ముగ్గురు కాన్పూర్‌కు చెందినవారిగా గుర్తించారు. వారు బాంకే బిహారీ దేవాలయాన్ని సందర్శించడానికి వచ్చారు. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని.. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జేసీబీ సాయంతో అధికారులు శిథిలాలను తొలగిస్తున్నారు.
Read Also: Heart Attack Treatment: గుండె చికిత్సలపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. ప్రత్యేక వైద్య వ్యవస్థ ఏర్పాటు..
Also Read
ఈ ఘటనపై ఎస్ఎస్పీ శైలేష్ పాండే మాట్లాడుతూ.. జిల్లాలో మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తోందని.. వర్షం కారణంగా సాయంత్రం ఇంటి పైభాగం ఒక్కసారిగా కుప్పకూలిందని తెలిపారు. స్థానికులు ఈ ఘటనపై సమాచారం అందించారని.. వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు తెలిపారు. మరోవైపు మునిసిపల్ కార్పొరేషన్ బృందాన్ని సంఘటనా స్థలానికి పిలిచినట్లు ఎస్ఎస్పీ శైలేష్ పాండే తెలిపారు. వారు ఆ భవనాన్ని పరిశీలిస్తున్నారని.. భవనంలోని ఏదైనా భాగం దెబ్బతిన్నట్లు గుర్తించినట్లయితే, భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరగకుండా, భవనాన్ని కూల్చివేయనున్నట్లు తెలిపారు. మరోవైపు ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో జనాలు భయాదోళనకు గురయ్యారు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!