Barabanki Road Accident: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 35 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బారాబంకి-బహ్రైచ్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. బారాబంకిలో యాత్రికులను తీసుకెళ్తున్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. గోండాలోని దుఖ్హరన్ నాథ్ మహాదేవ్ ఆలయంలో ప్రార్థనలు చేసి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Also Read: Viral Video: ఢిల్లీ మెట్రోలో పొట్టుపొట్టు కొట్టుకున్న ఇద్దరు మహిళలు.. ఇంతకీ ఏం జరిగిందంటే?
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని రామ్‌నగర్‌లోని సిహెచ్‌సికి తరలించారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో అవస్తి ధాబా సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.