Road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 35 మందికి పైగా..!

  • ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
  • ప్రమాదంలో గాయపడ్డ 35 మంది
  • 10 మంది పరిస్థితి విషమం
Road Accident

Road Accident

Barabanki Road Accident: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 35 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బారాబంకి-బహ్రైచ్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. బారాబంకిలో యాత్రికులను తీసుకెళ్తున్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. గోండాలోని దుఖ్హరన్ నాథ్ మహాదేవ్ ఆలయంలో ప్రార్థనలు చేసి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Also Read: Viral Video: ఢిల్లీ మెట్రోలో పొట్టుపొట్టు కొట్టుకున్న ఇద్దరు మహిళలు.. ఇంతకీ ఏం జరిగిందంటే?

×
×
Ad

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని రామ్‌నగర్‌లోని సిహెచ్‌సికి తరలించారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో అవస్తి ధాబా సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.