Site icon NTV Telugu

Uttam Kumar Reddy : భట్టి విక్రమార్క గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు..

Uttam

Uttam

Uttam Kumar Reddy : అత్యున్నత ప్రమాణాలతో యంగ్ ఇండియా తెలంగాణ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం జరుగుతుందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఇవాళ సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 200 కోట్ల రూపాయలతో స్కూల్ నిర్మాణం జరగబోతుందన్నారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. భట్టి విక్రమార్క గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడని, కాంగ్రెస్ పార్టీకి విధేయుడన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశాడని, భట్టి విక్రమార్క సమర్థవంతమైన నాయకత్వంతో రైతు రుణమాఫీ చేసామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. పరిచయం అవసరంలేని వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని, అన్ని స్థాయిల్లో కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన ఘనత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిది అని ఆయన కొనియాడారు.

Jr NTR Sons: వెంకటేష్ తో జూ.ఎన్టీఆర్ కొడుకుల సందడి

నియోజకవర్గ ప్రజలే నా కుటుంబ సభ్యులు అని, మీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు మా జీవితాన్ని త్యాగం చేశామన్నారు రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఆయన ఉద్ఘాటించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్‌. 150 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఈసారి మార్కెట్ కు రాబోతుందని, జనవరి నుండి రేషన్ కార్డు దారులకు సన్న బియ్యాన్ని ఇవ్వబోతున్నామన్నారు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.

India-Bangladesh: భారత్‌పై బంగ్లాదేశ్ చాకచక్యం.. మాల్దీవులతో కలిసి కొత్త గేమ్!

Exit mobile version