Uttam Kumar Reddy : ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు స్వయంభు రామలింగేశ్వర స్వామి వారిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. అయితే.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అధికారులు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 13 నుండి 14 లోక్ సభ స్థానాలను గెలుచుకుంటుందని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతామని, బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉంటే.. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు మాత్రమే అన్ని రకాలుగా లాభపడ్డారన్నారు. వ్యవసాయ రంగానికి సాగునీటిని మరింత విస్తరిస్తామని, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు పెంచుతామన్నారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పునరుద్ధరిస్తామని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా అవినీతిమయమన్నారు ఉత్తమ్ కుమార్. 6 గ్యారంటీల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందన్నారు. బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. మేమంతా రామ భక్తులమే రామ మందిరం అంశాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఈవెంట్ గా మారుస్తున్నారన్నారు. శంకరాచార్యులు , మఠాధిపతులు రామమందిర ప్రతిష్ఠకు దూరంగా ఎందుకు ఉంటున్నారో బండి సమాధానం చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
Also Read
- Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
- RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
- 165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
తాజావార్తలు
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!