Uttam Kumar Reddy : శ్రీశైలం సమీపంలోని SLBC టన్నెల్‌లో ఘోర ప్రమాదం సంభవించి, ఎనిమిది మంది సిబ్బంది అందులో చిక్కుకుపోయారు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజులు గడిచినా, కార్మికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వారి కోసం అధికారులు అన్ని విధాలుగా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. రక్షణ చర్యల్లో పురోగతి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే.. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అక్కడ పేరుకుపోయిన మట్టి నీరు సిల్ట్ వుందన్నారు. 15 నుండి 20 మీటర్ల వరకు బురద నీటితో కూరుకుపోయిందని, దేశంలోని బెస్ట్ ఆర్మీ ఆఫీసర్ లను రప్పించామన్నారు. గ్యాస్ కట్టర్ లలో tbm మిషన్ భాగాలను తొలగించేందుకు నిర్ణయించుకున్నామని, నిన్న వాటర్ బయటికి పంపే ప్రయత్నంలో…. రిస్క్యూ ఆపరేషన్ కాస్త లేట్ అయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు. రెస్క్యూ లో పాల్గొనే వారు రిస్క్యూలో పడకూడదని నిర్ణయంతో ముందుకు వెళుతున్నామని, అధికారులు అంతా నిబద్ధతతో పని చేస్తున్నారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సిల్ట్ లోకీ వెళ్ళి కూరుకుపోయిన వారిని బయటకు తెచ్చేందుకు ఇప్పటి నుండే యాక్షన్ ఉంటుందని, బెస్ట్ టన్నెల్ ఎక్స్ పర్ట్ లను రప్పించామని ఉత్తమ్ తెలిపారు. మరో రెండు రెండు రోజుల్లో వారి ఆచూకి తెలుసుకుంటామన్నారు. వారీ బ్రతికి వున్నారనే నమ్మకంతో రెస్క్యూ మిషన్ వేగవంతం చేసామని, రెస్క్యూ మిషన్ లో చాలా సాంకేతిక సమస్యలు వస్తున్నాయన్నారు. ప్లాస్మా కట్టర్, వెల్డింగ్ పరికరాలతో tbm మిషన్ వెనుక భాగాన్ని తొలగిస్తామని, దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
Mahakumbh Mela 2025: నేటితో ముగియనున్న కుంభమేళా.. పవిత్ర స్నానాల కోసం పోటెత్తిన భక్తులు