NTV Telugu Site icon

Uttam Kumar Reddy: 2024లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం

Utham

Utham

సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావులు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మునగాల మండల ఎంపీపీ, జడ్పీటీసీ ఇతర గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఉత్తమ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో నేను మాజీ ఎమ్మెల్యే చందర్ రావు అధికారం అడ్డు పెట్టుకొని ఏరోజు కూడా అధికారం దుర్వినియోగం చేయలేదు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వేనేపల్లి చందర్ రావు కి ప్రత్యేక స్థానం కలిస్తామన్నారు.

Read also: Sajjala Ramakrishna Reddy: భువనేశ్వరి టీడీపీ అధ్యక్షురాలు కానున్నారా..? లోకేష్‌ను ఎందుకు దూరం పెడుతున్నారు?

కోదాడ చరిత్రలోనే చారిత్రాత్మక మార్పు అన్ని భావిస్తున్నాను అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కట్టిన నాగార్జున సాగర్ ద్వారా 12 లక్షల ఎకరాలు పంటలు పండుతున్నవి.. లక్షల కోట్లతో కట్టిన మెడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడం ప్రభుత్వనికి సిగ్గు చేటు.. నాణ్యత లేని ప్రాజెక్టును కట్టినందుకు సిగ్గుపడలి.. కేసీఆర్ ప్రభుత్వ అవినీతి అక్కడే కనిస్తుంది.. కోదాడ, హుజుర్ నగర్ లలో 24 గంటల కరెంట్ ఎక్కడ రావడం లేదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కోదాడలో వేల ఎకరాలు ఎండిపోవడానికి కారణం అసమర్ధ ప్రభుత్వం వల్లనే.. మా హయాంలోనే రెండు పంటలు పండిన చరిత్ర ఉంది.. అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి నవంబర్ 3వ తేదీ లోపు నిధులు విడుదల చేయాలి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

Read also: Corn Cultivation : మొక్కజొన్న సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

నవంబర్ 3 నాటికి రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, రుణమాఫీ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అవినీతి అక్రమాలకు కేరాఫ్ గా ఎమ్మెల్యే ఉన్నాడు.. అవినీతి అక్రమాలకు కూడా టోకెన్ వ్యవస్థ పెట్టిన చరిత్ర స్థానిక ఎమ్మెల్యేది.. మందు తాగే వాళ్లకు కూడా ఎమ్మెల్యే ట్యాక్స్ వేస్తున్నాడు.. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య ను ఇంటికి పంపించాలి.. అధికార పార్టీ నాయకులు గంజాయి వ్యాపారం చేస్తున్న పట్టించుకోవడం లేదు.. త్వరలో సీఎం కేసీఆర్, మల్లయ్య యాదవ్ ను ఫామ్ హౌస్ కి పరిమితమవుతారు.. రాష్ట్రంలో 70 నుండి 75 స్థానాలు గెలవడం ఖాయం.. 2024లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.