మన దేశంలో అధికంగా పండిస్తున్న వాణిజ్య పంటలలో మొక్క జొన్న కూడా ఒకటి.. వర్షాధార పంటగా చెప్పవచ్చు.. ఖరీఫ్, రభీల లో ఈ పంటను ఎక్కువగా పండిస్తున్నారు.మొక్కజొన్న ఆహార పంటగానే గాక, దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరకుగాను, పేలాల పంటగాను, తీపికండె రకంగా, కూరలకు వాడే కూరగాయలాగా కూడా వాడుతున్నారు.. అందుకే ఈ పంటకు ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది.. దాంతో రైతులు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు..
ఈ పంట వర్షాధార పంటగా చెప్తున్నారు.. ఇక ఎక్కువగా మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్, జిల్లాలలో అధిక సాగులో ఉన్నది. నీటి పారుదల క్రింద గుంటూరు, పశ్చిమ గోదావరి, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో ఎక్కువ సాగులో ఉన్నది.. మొక్క జొన్న వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందుకే పక్క రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతుంది..కొలెస్ట్రాల్ మరియు సోడియం ఉండదు, కాబట్టి కార్న్‌ఫ్లోర్‌తో చేసిన వంటకాలను గుండె జబ్బులు ఉన్నవారు సురక్షితంగా తీసుకోవచ్చు. ఇంకా, డైటరీ ఫైబర్స్ మరియు విటమిన్ B3 అధికంగా ఉంటాయి..
ఇకపోతే ఒక పదును వర్షం కురిసిన తర్వాత మాత్రమే ఈ పంటను విత్తుకోవాలి.. ఖరీఫ్లో వర్షాధారం క్రింద మొక్కజొన్నలో అంతరం పెసర లేదా మినుము వేసుకోవాలి. ఎకరానికి 8 కిలోల విత్తనాన్ని, 60×20 సెం.మీ., ఎడమలో విత్తుకొని 33,333 మొక్కలు ఉండేలా చూడాలి.. తెగుళ్ల నివారణ కూడా ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి.. ఇక మోనోక్రోటోఫాస్6. మి.లీ., ఒక లీటరు నీటిలో కలిపి పైరు మొలకెత్తిన 10-12 రోజులకే పిచికారి చేయాలి. విత్తిన 45 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూడాలి.. అలాగే గింజలు పట్టే సమయంలో నీటి పారుదల ఆపాలి.. అప్పుడే గింజలు మంచి సైజులో ఎక్కువ రోజులు ఉంటాయి..ఎరువుల యాజమాన్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.. పంట గురించి ఏదైనా సందేహం ఉంటే వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..