NTV Telugu Site icon

Uttam Kumar Reddy: కల్పిత విషయాలతో ప్రచారం చేస్తున్నారు

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

బీఆర్‌ఎస్‌ బీజేపీ.. కలిసి మా ప్రభుత్వం పై అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని, కల్పిత విషయాలతో ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి అన్నారు. వారు చేసే ప్రచారంలో నయా పైసా నిజం లేదని ఆయన అన్నారు. మేము అధికారంలోకి వచ్చాక సమీక్ష చేస్తే.. అస్తవ్యస్త పరిస్థితి అని, సివిల్ సప్లై లాసులు 11 వేళా కోట్లు అని ఆయన అన్నారు. రైస్ మిల్లుల దగ్గర ధాన్యం 20 వేళా కోట్ల ధాన్యం వదిలేశారు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నేతలు అని ఆయన మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయం లో గత పాలకుల కంటే కొనుగోలు ముందు మొదలు పెట్టాం.. డబ్బులు వెంటనే ఇచ్చేలా ఏర్పాట్లు చూశామని, తాలు.. తరుగు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఉందన్నారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. . వీలైనంత వరకు తాలు..తరుగు తగ్గించామని, . 10 శాతం తాలు తరుగు తీస్తున్నారు అని ఓ పెద్ద మనిషి అంటారన్నారు. వెయ్యి కోట్లు నేను తీసుకున్న అట అని, ఇంత నిచపు మాటలు మానుకోవాలన్నారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.

తాను రాష్ట్రంలో యూ ట్యాక్స్ వసూల్ చేస్తు్న్నానంటూ బీజేపీ ఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గాంధీభవన్‌లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వినతిపత్రాలు తీసుకొచ్చి సీఎం దగ్గరికి పోయి.. లోపలికి వెళ్లాక ల్యాండ్ సెటిల్‌‌మెంట్ విషయాలు మాట్లాడినట్లు కాదని మహేశ్వర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సచివాలయానికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. ఇక, బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవి కోసం ఆయనే ఢిల్లీకి డబ్బులు పంపినట్టు ఉన్నారని అన్నారు. తాను వెయ్యి కోట్లు తీసుకున్నానని మాట్లాడుతున్నారు, కానీ నేను ఎవరి దగ్గర నయా పైసా కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు.

తనపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని, ఇప్పటికైనా ఇలాంటి నీచపు మాటలు మానుకోవాలని చురకలంటించారు. ఢిల్లీకి డబ్బులు పంపించే సంస్కృతి బీజేపీకి ఉందని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ మాటల్లో నిజం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.200 కోట్ల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందని, అలాంటిది ధాన్యం కొనుగోళ్లలో రూ.2 వేల కోట్ల అవినీతి ఎలా జరిగిందని మంత్రి ప్రశ్నించారు. తాను ఉత్తమ్ కుమార్ రెడ్డినని.. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే అస్సలు ఊరుకోనని హెచ్చరించారు. పౌరసరఫరాల శాఖను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని, రూ.11 వేల కోట్ల అప్పుల్లో ముంచిందని ఫైర్ అయ్యారు.