NTV Telugu Site icon

Uterus in Man Stomach: యువకుడి కడుపులో గర్భాశయం.. షాక్ తిన్న డాక్టర్లు!

Uterus In Man Stomach

Uterus In Man Stomach

Doctors find uterus in 27-year-old man’s stomach: ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్‌తరీ జిల్లాలో ఓ 27 ఏళ్ల యువకుడి కడుపులో అభివృద్ధి చెందని గర్భాశయాన్ని వైద్యులు గుర్తించారు. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి, శస్త్రచికిత్స ద్వారా కడుపులో నుంచి గర్భాశయాన్ని తొలగించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి నిలకడగా ఉందని, మరికొన్ని రోజులు చికిత్స కొనసాగించాలని వైద్యులు తెలిపారు. పురుషులలో గర్భాశయం ఉండటం చాలా అరుదైన విషయం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటివి 300 కేసులు నమోదయ్యాయి.

వివరాల ప్రకారం.. కంకేర్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల యువకుడికి కడుపులో నిరంతరం నొప్పి వచ్చేది. అంతేకాదు ఇటీవల అతని కుడి తొడలో కూడా వాపు కనిపించింది. సెప్టెంబరు 25న కుటుంబసభ్యులు అతడిని చికిత్స నిమిత్తం కాంకేర్‌ నుంచి ధమ్‌తరీకి తీసుకొచ్చారు. అక్కడ ఉపాధ్యాయ్ నర్సింగ్ హోమ్‌లో చేర్చారు. డాక్టర్ రోషన్ ఉపాధ్యాయ యువకుడికి పరీక్షలు చేయగా.. కడుపులో గర్భాశయం ఉన్నట్లు తేలింది. అతడికి వృషణాలు లేవు.

యువకుడి కడుపులో గర్భాశయం మరియు స్టెరిలైజేషన్ ట్యూబ్‌లు ఉన్నాయి. అతని కడుపులో కుడి వైపున వృషణాలు ఉన్నాయి. డాక్టర్ రోషన్ ఉపాధ్యాయ యువకుడి కుటుంబ సభ్యులకు ఆ అవయవాలను చూపించారు. ఆపై కుటుంబసభ్యుల అనుమతితో యువకుడి కడుపులోపల ఉన్న గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్‌ను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. అలాగే కుడి వృషణం యొక్క వృషణాలను పొత్తికడుపు నుండి తీసివేసి.. క్రింద ఉన్న సంచిలో ఉంచారు. యువకుడికి సెప్టెంబర్ 26న శస్త్రచికిత్స జరగ్గా.. అక్టోబర్ 1న డిశ్చార్జి అయ్యాడు.

Also Read: UP Police: యూపీలో దారుణం.. వికలాంగ మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన కానిస్టేబుళ్లు!

అక్టోబర్ 1న నర్సింగ్ హోమ్ డాక్టర్ రోషన్ ఉపాధ్యాయ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అరుదైన ఆపరేషన్ గురించి తెలియజేశారు. ఇప్పటికే ఆలస్యమైందని, ఇంకా జాప్యం చేస్తే భవిష్యత్తులో క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉండేదని తెలిపారు. ఇలాంటి కేసులు చాలా అరుదు అని, ప్రపంచంలో ఇలాంటివి 300 కేసులు ఉండవచ్చన్నారు. పుట్టుక సమయంలోనే వీటిని గుర్తిస్తామని, ఆరేళ్ల వయసులోపే ఆపరేషను చేసి నయం చేస్తామన్నారు. గ్రామాల్లో మంత్రసానులు ప్రసవం చేస్తే.. ఈ ముప్పును గుర్తించరని రోషన్ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు.